Savitri House Viral: మళ్లీ మనసులు గెలిచేశావ్ డబ్బులు ఊరికే రావు గుండు అంకుల్

Lalitha Jewellery Founder M Kiran Kumar Bought Savitri Residence: తనదైన శైలిలో బంగారం వ్యాపారం చేస్తూ ప్రజలను ఆకర్షిస్తున్న లలితా జ్యువెలరి అధినేత ఎం కిరణ్‌ కుమార్‌ మరో ప్రత్యేకతను చాటుకున్నారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Sep 12, 2024, 12:27 PM IST
Savitri House Viral: మళ్లీ మనసులు గెలిచేశావ్ డబ్బులు ఊరికే రావు గుండు అంకుల్

Lalitha Jewellery M Kiran Kumar: తన బంగారం వ్యాపారంతో అందరి దృష్టిని ఆకర్షించే లలితా జ్యువెలరి‌ యజమాని ఎం కిరణ్‌ కుమార్‌ మరో ప్రత్యేకత చాటుకున్నారు. తాను ఆరాధించే నటి సావిత్రి ఇల్లు కొనుగోలు చేసిన ఆయన రోజు ఆమెపై అభిమానం చాటుకుంటున్నారు. ఎంతలా అంటే దేవుడి కన్నా గొప్పగా సావిత్రిని పూజించుకుంటున్నారు. ఇంట్లోకి అడుగుపెట్టగానే సావిత్రి ఫొటో కనిపిస్తుంది. నిత్యం ఆ ఫొటోకు నమస్కారం చేస్తూ వెళ్తున్నట్లు ప్రకటించారు. సావిత్రిపై తనకు ఉన్న అభిమానాన్ని ఓ ఇంటర్వ్యూలో కిరణ్‌ కుమార్‌ చాటుకున్నారు.

Also Read: AP Floods: 'డబ్బులు ఊరికే రావు' యజమాని ఏపీ వరదలకు భారీ విరాళం

 

'డబ్బులు ఎవరికీ ఊరికే రావు' అనే డైలాగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించి బిజినెస్‌ను అమాంతం పెంచేసుకున్న కిరణ్‌ కుమార్‌ తెలుగు వ్యక్తి కాదు. తెలుగు వారికి సుపరిచితమైన ఎం కిరణ్‌ కుమార్‌ ఏపీ సరిహద్దు ప్రాంతం తమిళనాడుకు చెందిన వారు. దశాబ్దాల కిందట ఓ బంగారం కొట్టులో పనికి కుదిరి బంగారం వ్యాపారం మెలకువలు నేర్చుకున్న కిరణ్‌ కుమార్‌ అనంతరం దేశంలోనే అతిపెద్ద బంగారం వ్యాపారవేత్తగా ఎదిగారు. అయితే ఆయన మొదట చెన్నై కేంద్రంగా వ్యాపారాన్ని ప్రారంభించారు. ఇప్పుడు లలితా జ్యువెలిరీ మార్ట్ లిమిటెడ్ అధినేతగా ఎమ్ కిరణ్ కుమార్ అవతరించారు. కెరీర్‌ ప్రారంభంలో మహా నటి సావిత్రి ఇంట్లో అద్దెకు ఉండేవారు. కొన్నేళ్ల నుంచి అద్దెకు ఉంటున్న ఇంటినే తర్వాత కిరణ్‌ కుమార్‌ కొనుగోలు చేశారు.

Also Read: Aarti Ravi: జయం రవి విడాకుల్లో బిగ్‌ ట్విస్ట్‌.. కలిసి ఉంటానని బాంబు పేల్చిన భార్య ఆర్తి రవి

 

అయితే ఆ ఇంటిని కొనుగోలు చేసిన తర్వాత సావిత్రి కుటుంబసభ్యులు అన్నీ వస్తువులను తీసుకెళ్లారు. ఇంటికి ఎదురుగా ఉన్న సావిత్రి అందమైన ఫొటోను కూడా తీసుకుని వెళ్లిపోయారు. అనంతరం ఇంటికి వచ్చి చూసిన కిరణ్‌ కుమార్‌ ఫొటో లేకపోవడం గమనించారు. తాను ఆరాధించే దేవత.. తాను నిత్యం పూజించే సావిత్రి ఫొటో లేకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. వెంటనే సావిత్రి కుటుంబసభ్యులకు ఫోన్‌ చేసి ఫొటో తిరిగి తెచ్చివాలని డిమాండ్‌ చేశారు. కావాలంటే అలాంటి ఫొటోలు ఎంత ఖరీదు పెట్టయినా తీసి ఇస్తాను కానీ ఆ ఫొటోను మాత్రం తనకు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 

ఇల్లు తీసుకున్నా పర్లేదు కానీ తనకు ఆ ఫొటో ఇవ్వాలని ఎం కిరణ్‌ కుమార్‌ కోరారు. అతడు మరి మరి కోరడంతో వెంటనే 45 నిమిషాల్లో సావిత్రి కుటుంబసభ్యులు ఆ ఫొటోను తిరిగి పంపించారు. ఇక అప్పటి నుంచి ఆ ఫొటోను ఇంట్లోకి అడుగు పెట్టగానే కుడి వైపున సావిత్రి ఫొటో కనిపిస్తుంటుంది. ఆ ఫొటోకు నిత్యం పూజ చేస్తూ తాను బయటకు వెళ్లేప్పుడు సావిత్రికి నమస్కరించి వెళ్తానని చెప్పారు. సావిత్రి అంటే తనకు ఎనలేని అభిమానం అని చెప్పారు. నలభై ఏళ్లుగా సావిత్రికి దండం పెట్టుకుని వెళ్తున్నానని అని చెప్పి సావిత్రిపై తనకున్న అభిమానాన్ని చెప్పారు. ఆ ఇంటర్వ్యూ చూసిన వారంతా కిరణ్‌ కుమార్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. మళ్లీ మనసులు గెలిచేశావ్‌ గుండు అంకుల్‌ అంటూ ప్రేమగా కామెంట్‌ చేస్తున్నారు.

కాగా ఇటీవల తెలుగు రాష్ట్రాలకు కిరణ్‌ కుమార్‌ భారీ విరాళం ప్రకటించారు. వరద బాధితుల సహాయార్థం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు రూ. కోటి చొప్పున కిరణ్‌ కుమార్‌ విరాళం అందించారు. ఇద్దరు ముఖ్యమంత్రులను కలిసి విరాళానికి సంబంధించిన చెక్కు అందించారు. 'కష్టాల్లో ఉన్న తెలుగు రాష్ట్రాలకు నాకు తోచినంత కోటి విరాళం ఇచ్చా. నాలాంటి వ్యాపారస్తులు వరద బాధితులకు అండగా నిలివాలి. ఎవరికి తోచిన సహాయం అందించాలి' అని ఈ సందర్భంగా కిరణ్‌ కుమార్‌ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News