Gold prices for Dussehra and Diwali: రాబోయే ఫెస్టివల్ సీజన్ అంటే దసరా దీపావళి ధన త్రయోదశి సందర్భంగా బంగారం రికార్డు స్థాయికి చేరే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని వెనక అనేక కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. అయితే బంగారం ఏ స్థాయిలో పెరగనుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Gold prices for Dussehra and Diwali: బంగారం ధరలు ప్రస్తుతం మరోసారి ఆల్ టైం రికార్డ్ స్థాయి దిశగా అడుగులు వేస్తున్నాయి. దీంతో బంగారం ధర నేడు మరోసారి 73 వేల మార్కును దాటింది. పసిడి ధరలు భారీగా పెరగడం వెనుక అంతర్జాతీయంగా ఉన్న కారణాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా అమెరికాలో పసిడి ధరలు పెరగడం కూడా ఒక కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఎందుకంటే అమెరికాలో ప్రస్తుతం కీలకమైన డేటా విడుదలవుతోంది ముఖ్యంగా ఇందులో ఇప్పటికే జాబ్స్ డేటా తో పాటు త్వరలోనే ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు అని కూడా పావు శాతం తగ్గిస్తుంది అనే వార్తలు వస్తున్నాయి. దీంతో నిపుణులు బంగారం ధర పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే పసిడి ధరలు పెరగడానికి ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించడానికి అవినాభావ సంబంధం ఉంది.
ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించినప్పుడల్లా బంగారానికి డిమాండ్ పెరిగి ధరలు పెరిగాయి. దీనికి ప్రధాన కారణం అమెరికా జారీ చేసే పది సంవత్సరాల ట్రెజరీ బాండ్లు విలువ కీలక వడ్డీ రేట్లు తగ్గించడం వల్ల తగ్గుతుంది. ఫలితంగా ఈ బాండ్లపై వచ్చే రాబడి కూడా తగ్గిపోతుంది. దీంతో పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడి సాధనంగా భావించే బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తుంటారు.
ఇక దేశీయంగా చూసినట్లయితే దసరా దీపావళి సందర్భంగా బంగారం ధర 75 వేల మార్కును దాటి రికార్డు సృష్టించే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం బంగారం ధరలు 73 వేల మార్కు వద్ద ఉన్నాయి. ఇక్కడ నుంచి బంగారం ధర మరో రెండు వేల రూపాయలు పెరగడం పెద్ద కష్టమేమీ కాదు. ఈ నెల చివరి నాటికి కొత్త రికార్డు ధర నమోదవుతుంది.
బంగారం ధరలు ఇప్పటికే కరెక్షన్ కూడా పూర్తి చేసుకున్నాయి. ఎందుకంటే జూలై నెలలో బడ్జెట్ సందర్భంగా బంగారం దిగుమతులపై సుంకం తగ్గించడంతో ఒక్కరోజే బంగారం ధర దాదాపు 4000 రూపాయలు తగ్గింది. అక్కడి నుంచి బంగారం ధర నెమ్మదిగా రికవరీ అవుతూ ప్రస్తుతం మరోసారి ఆల్ టైం గరిష్ట స్థాయిని తాకే అవకాశం ఉంది.
ప్రస్తుతం బంగారం ధర తగ్గించే ఈవెంట్స్ ఏమీ లేకపోవడంతో పసిడి ధరలు భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది దీనికి తోడు అమెరికా అధ్యక్ష ఎన్నికలు కూడా బంగారం ధర పెరుగుదలకు కారణం అవుతున్నాయి. ఎందుకంటే అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో అక్కడి స్టాక్ మార్కెట్లో తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోన్ అవుతాయి గత ఎన్నికల్లో కూడా మనం ఈ విషయాన్ని చూసాము ఈ నేపథ్యంలో ప్రస్తుతం కూడా అలాంటి పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది దీంతో పసిడి ధరలు దసరా దీపావళి సందర్భంగా భారీ స్థాయిని తాకే అవకాశం కనిపిస్తోంది