RRB Notification: రైల్వేలో 5 ఏళ్ల తర్వాత భారీ నోటిఫికేషన్‌.. 11000 పైగా ఖాళీలు.. ఈసారి ప్రశ్నాపత్రంలో ఈ భారీమార్పు..

RRB NTPC Notification 2024: రైల్వే జాబ్‌ కోసం ఎదురు చూస్తున్నవారికి తీపికబురు. రైల్వే రిక్రూట్మెంట్‌ బోర్డు (RRB) ఎన్టీపీసీ 11 వేలకు పైగా ఖాళీ భర్తీకి శ్రీకారం చుట్టింది. నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ చేపట్టింది. ఆ వివరాలు తెలుసుకుందాం.

Written by - Renuka Godugu | Last Updated : Sep 14, 2024, 02:37 PM IST
RRB Notification: రైల్వేలో 5 ఏళ్ల తర్వాత భారీ నోటిఫికేషన్‌.. 11000 పైగా ఖాళీలు.. ఈసారి ప్రశ్నాపత్రంలో ఈ భారీమార్పు..

RRB NTPC Notification 2024: నిరుద్యోగులకు ఆర్‌ఆర్‌బీ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఎన్టీపీఎస్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసి భారీ ఎత్తన ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టింది. దాదాపు ఐదేళ్ల తర్వాత ఈ భారీ నోటిఫికేషన్‌ను రైల్వే విడుదల చేసింది. ముఖ్యంగా ఇందులో గ్రాడ్యూయేట్‌ 8113, యూజీ 3445 భర్తీ చేయనుంది. ఈ పోస్టలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రైల్వే అధికారిక వెబ్‌సైట్‌ RRB Indianrailways.gov.in ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

సాధారణంగా రైల్వే జాబ్‌ అంటేనే పెద్ద ఎత్తున ఉద్యోగాల జాతర అందుకే దేశవ్యాప్తంగా ఎక్కువశాతం ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తుంటారు. 2019లో చివరిసారి భర్తీ చేసింది. ఆ తర్వాత తాజాగా ఇప్పుడు పోస్టుల భర్తీ చేయనుంది. ముఖ్యంగా ఈసారి ఎన్టీపీటీ ఖాళీలు తక్కువ ఉన్నాయి. కానీ, ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారి సంఖ్య ఎక్కువగా ఉంది. కాబట్టి అభ్యర్థుల మధ్య గట్టి పోటీ ఉంటుంది.

గ్రాడ్యుయేట్‌ లెవల్‌ .. పోస్టులు
చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్ 1736
స్టేషన్ మాస్టర్ 994
గూడ్స్ రైలు మేనేజర్ 3144
జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ 1507
సీనియర్ క్లర్క్ పోస్టులు: 1507

 

అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టులు
కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ 2022
అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 361
జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 990
ట్రైన్స్ క్లర్క్ 72

ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ రైల్వే రిక్రూట్మెంట్‌ నేడు 14 వ తేదీ నుంచి ప్రారంభమైంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేవారు అక్టోబర్‌ 13 చివరి తేదీ. ఈ పోస్టుల దరఖాస్తుకునేవారు గుర్తింపు పొందిన యూనిశర్శిటీ నుంచి డిగ్రీ పట్టా పొంది ఉండాలి. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి. గ్రాడ్యూయేట్‌ పోస్టులకు మాత్రం వయోపరిమితి 18-36 ఏళ్ల మధ్య ఉండాలి. ఏజ్‌ లిమిట్‌ రిలక్సేషన్‌ కూడా 3 ఏళ్లపాటు వర్తిస్తుంది.

ఇదీ చదవండి: కౌన్‌ బనేగా కరోడ్‌పతి షోలో పవన్‌ కల్యాణ్‌పై ప్రశ్న? ఏమని అడిగారో తెలుసా?

గ్రాడ్యూయేట్లకు నేటి నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకోవచ్చు. అండర్‌ గ్రాడ్యూయేట్లు మాత్రం ఈనెల 21 నుంచి దరఖాస్తు ప్రారంభం అవుతుంది. వీరికి దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్‌ 20. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే జనరల్‌ ఓబీసీవారు రూ. 500 చెల్లించాలి. ఎస్సీ,ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళ, ఎక్స్‌, ట్రాన్స్‌జెండర్‌ వారు రూ.250 చెల్లించాలి.మొదట కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. ఇది ఫస్ట్‌, సెకండ్‌ రెండు స్టేజీల్లో ఉంటుంది. ఆ తర్వాత టైపింగ్‌ టెస్ట్‌, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ నిర్వహిస్తారు, చివరగా మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ద్వారా ఎంపిక చేస్తారు.

ఇదీ చదవండి: మహా నిమజ్జనం.. ఈ నెల 17వ తేదీ అన్నీ స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News