Kolkata Doctor case: కోల్ కతాలో నిరసనల్లో కీలక పరిణామం.. మమతను కలిసేందుకు అంగీకరించిన వైద్యులు.. కానీ..

Kolkata doctor murder case: కోల్ కతా జూనియర్ డాక్టర్ నిరసనల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ క్రమంలో మమతా సర్కారు నుంచి ఐదవ సారి చర్చలకు రావాలని డాక్టర్లకు పిలుపు అందించారు. దీంతో వైద్యులు వెళ్లేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.  

Written by - Inamdar Paresh | Last Updated : Sep 16, 2024, 05:49 PM IST
  • ఐదవ సారి వైద్యులకు మమతా నుంచి పిలుపు..
  • కోల్ కతాలో గంభీర వాతావరణం..
Kolkata Doctor case: కోల్ కతాలో నిరసనల్లో కీలక పరిణామం.. మమతను కలిసేందుకు అంగీకరించిన వైద్యులు..  కానీ..

Kolkata doctor muder case: కోల్ కతా జూనియర్ డాక్టర్ల ఘటన ప్రస్తుతం దేశంలో పెనుదుమారంగా మారిన విషయం తెలిసిందే. ఇప్పటికి కూడా కోల్ కతాలో జూనియర్ డాక్టర్లు సమ్మేను చేపట్టారు. మరోవైపు.. సుప్రీంకోర్టు విధుల్లో చేరాలని ఆదేశించిన కూడా.. వైద్యులు మాత్రం ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఈ క్రమంలో ఇటీవల మమతా బెనర్జీ సెప్టెంబర్ 14 న నిరసన తెలియజేస్తున్న డాక్టర్లదగ్గరకు వెళ్లి , చర్చలకు రావాలని కూడా పిలుపునిచ్చారు. తాను.. సీఎంగా కాకుండా.. ఒక దీదీలా వచ్చానని చెప్పారు. మీ బాధలన్ని వింటానన్నారు.

ఈక్రమంలో జూనియర్ డాక్టర్ లు మాత్రం తమతో మీటింగ్ ను లైవ్ టెలికాస్టు చేయలని, 40 మంది వస్తామని చెప్పారు. కానీ సీఎం తరపు ప్రతినిధులు మాత్రం.. కేసు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి.. లైవ్ స్ట్రీమింగ్ కుదరదని, కావాలంటే మీరు ఫోన్ లలో రికార్డులు చేసుకొవచ్చని తెలిపారు. అదే విధంగా 10 మంది సభ్యులుగా ఏర్పడి చర్చలకు రావాలని మమతా తరపు ప్రతినిధులు చెప్పారు. కానీ జూనియర్ డాక్టర్లు మాత్రం దీనికి అంగీకరించలేదు. ఈ క్రమంలో సెప్టెంబరు 14 న మమతా నివాసమైన.. కాళీ ఘాట్ సమీపంలోని..బంగ్లాకు చేరుకుని మమతా కోసం చూశారు. కానీ అప్పటికే  జూనియర్ డాక్టర్లు చెప్పిన సమయం కన్నా.. ఆలస్యంగా రావడంతో సమావేశం జరగలేదు.

తాజాగా, ఐదోసారి అదే విధంగా చివరిసారి మమతా సర్కారు నుంచి కూడా జూనియర్ డాక్టర్లుకు పిలుపు అందింది. దీంతో డాక్టర్లు సైతం.. మమతాను కలిసి, చర్చలు జరిపేందుకు ఆసక్తి చూపించినట్లు తెలుస్తోంది. ఈక్రమంలోదీని కోసం సీఎంవో ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేసినట్లు తెలుస్తోంది. దీనిపై ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఈ సమావేశంకు వైద్యులు కొన్ని డిమాండ్ లు పెట్టినట్లు తెలుస్తోంది. 1. ఇరువైపుల వారు ప్రత్యేకంగా వీడియో గ్రఫీ రికార్డు చేసేలా అనుమతివ్వాలి. 2. సమావేశం కాగానే వీడియో ఇవ్వడానికి అనుమతి ఇవ్వాలి 3. సమావేశంకు హజరైన వారంతా సంతకం చేసిన కాపీని ఇవ్వాలి.
4. మీటింగ్ ఆఫ్ మినిట్స్ ను రికార్డు చేసేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని అనుమతించాలనే డిమండ్ లను చేశారు.

ఇదిలా ఉండగా.. ఆగస్టు 6 న చోటు చేసుకున్న ట్రైనీ డాక్టర్ హత్యాచారం దేశ వ్యాప్తంగా ప్రతి  ఒక్కర్ని కంటతడి పెట్టించిందని చెప్పుకొవచ్చు.రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, పీఎం మోదీ,సుప్రీంకోర్టు.. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా దీనిపై స్పందించారు. ఈ క్రమంలో ఇటీవల సుప్రీంకోర్టు సైతం కేసును విచారించి సీబీఐకు స్టేటస్ కో రిపోర్టును తమ ముందు ఉంచాలని కూడా.. తీర్పును సెప్టెంబర్ 17కు వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మమతా తో వైద్యుల భేటీ మాత్రం ప్రాధాన్యత సంతరించుకుంది.

Read more: Viral Video: వినాయక నిమజ్జనం వేళ అద్భుతం.. గణపయ్య మెడలో చేరిన నాగు పాము.. వీడియో వైరల్..

ఇప్పటి వరకు ఈ కేసులో సంజయ్ రాయ్, సందీప్ ఘోష్, అభిజిత్ మండల్ అనే పోలీసు అధికారిని సీబీఐ అదుపులోకి తీసుకుని విచారిస్తున్న విషయం తెలిసిందే. కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం కేసులో ఆర్​జీ కర్‌ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపల్‌ సందీప్‌ ఘోష్‌ పాలిగ్రాఫ్‌ పరీక్ష, లేయర్డ్‌ వాయిస్‌ అనాలసిస్‌తో నిర్వహించారు.

దీనిలో.. మోసపూరిత సమాధానాలు ఇచ్చినట్లు బైటపడింది. సీఎఫ్ఎస్ఎల్ ఈ మేరకు నివేదిక ఇచ్చినట్లు సీబీఐ అధికారుల తెలిపారు. ఈ కేసులో పోలీసు అధికారి అభిజిత్‌ మోండల్‌, సందీప్‌ ఘోష్‌ కలిసి నేరాన్ని తక్కువ చేసి చూపడం సహా దాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నించారని సీబీఐ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News