8Th Pay Commission Latest News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే ఊహించని గుడ్ న్యూస్ ను రాబోతోంది. మరోసారి 8Th Pay Commission పైన ఆల్ ఇండియా రైల్వేమెన్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ శివగోపాల్ మిశ్రా కీలక వ్యాఖ్యాలు చేశారు. ఎనిమిదో సంఘం వేతనం అమలకు వస్తే ప్రభుత్వ ఉద్యోగులకు కనీస వేతనం రూ. 18,000 నుంచి రూ. 34,560 పెరుగుతుందని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటి నుంచో 8వ వేతన సంఘం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సంఘం అమలైతే వారి వేతనాలు, భత్యాలు పెరిగే అవకాశం ఉంది. తాజాగా జనవరి 2026 నుంచి కేంద్ర ఉద్యోగులకు వేతనాలు పెరుగుతాయని ఆల్ ఇండియా రైల్వేమెన్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ శివగోపాల్ మిశ్రా తెలిపారు.
జనవరి 2026 నాటికి కేంద్ర ప్రభుత్వం ఎనిమిదో సంఘం వేతనంను అధికారికంగా ప్రకటిస్తుందని సమాచారం. 8th Pay Commission అమలు అవుతే ప్రభుత్వ ఉద్యోగులకు కనీస వేతనం రూ. 18,000 నుంచి రూ. 34,560 పెరుగుతుంది. అలాగే కనీస పెన్షన్ రూ. 17,280కి పెరగవచ్చు.
కేంద్ర ఉద్యోగుల జీతాలు ఖచ్చితంగా పెరుగుతాయని శివగోపాల్ మిశ్రా తెలిపారు. కానీ ఎనిమిదో వేతన సంఘంపై ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఎక్కడ ప్రకటించలేదు.
8వ వేతన సంఘంను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తే రైల్వే ఉద్యోగులకు ఎన్నో లాభాలు కలుగుతాయని శివగోపాల్ మిశ్రా తెలిపారు.
ఈ ఎనిమిదవ వేతన సంఘం అమల్లోకి వస్తే పెరుగుతున్న ద్రవ్యోల్బణం, జీవన వ్యయం నుంచి కూడా ఉపశమనం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే కేంద్రం కూడా దీనిని దృష్టిలో పెట్టుకొని ఎనిమిదో వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఎనిమిదో వేతన సంఘంపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే త్వరలోనే ఈ సంఘంపైన కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే వల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది.