Side Effects Of Curd: పెరుగు ఆరోగ్యానికి ఉపయోగపడే ఆహారం. ఇందలో పోషకాలు అధికంగా ఉంటాయి. దీని వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. అయితే కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు మాత్రం పెరుగు తినడం వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యల బారిన పడాల్సి ఉంటుందని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు. అయితే ఎలాంటి వారు పెరుగును తీసుకోకుండా ఉండాలి అనే విషయాలు తెలుసుకుందాం.
పెరుగు ఆరోగ్యలాభాలు:
పెరుగులో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థకు, కండరాల పెరుగుదలకు, రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా ఎంతో సహాయపడుతుంది.ఇందులో ఉండే క్యాల్షియం ఎముకలను దృఢంగా తయారు చేయడం లో ఉపయోగపడుతుంది. అలాగే పెరుగులో విటమిన్ బి12 కూడా ఉంటుంది. ఇది రక్త కణాల ఉత్పత్తికి, నరాల ఆరోగ్యానికి చాలా అవసరం. పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్‌చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కీలక ప్రాత పోషిస్తుంది. దీని వల్ల చర్మం పై మొటిమలు, మచ్చలు, ముడతలు రాకుండా ఉంటాయి. బరువు తగ్గించడంలో కూడా పెరుగు సహాయపడుతుంది. ఇందులో ఉండే ప్రోటీన్ ఆకలిని తగ్గించడంలో మేలు చేస్తుంది. అయితే ఆరోగ్యనిపుణుల ప్రకారం ప్రతిరోజు ఒక కప్పు పెరుగును ఆహారంలో భాగంగా తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. కేవలం పెరుగు మాత్రమే కాకుండా ఇందులో పండ్లు, గింజలు, తేనె ను కూడా కలుపుకొని తినవచ్చు. ఉదయం పెరుగు తినడం కంటే రాత్రి పడుకొనే ముందు పెరుగు తినడం వల్ల మంచి నిద్ర పడుతుందని వైద్యలు చెబుతున్నారు.
ఎలాంటి వ్యధిగ్రస్తులు పెరుగును తినకూడదు:
పెరుగు ఆరోగ్యకరమైన ఆహారం అయినప్పటికి అనారోగ్య సమస్యలతో బాధపడేవారు దీని తీసుకోవడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల ఆరోగ్య సమస్యలు మరింత అధికమవుతాయని చెబుతున్నారు. అందులో ..
ఆర్థరైటిస్: కీళ్లు, మోకాళ్లు, ఒంటి నొప్పులతో బాధపడేవారు తీసుకోవడం వల్ల ఇందులో ఉండే కాల్షియం కారణంగా సమస్య మరింత పెరుగుతుందని చెబుతున్నారు. దీనికి బదులగా ఒక గ్లాస్ మజ్జిగను తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
మలబద్ధకం: గ్యాస్, మలబద్ధకం ఉన్నవారు పెరుగు తినడం వల్ల జీర్ణవ్యస్థ దెబ్బతింటుంది. కాబట్టి పెరుగు తినడం మంచిది కాదు.
అధిక కొలెస్ట్రాల్ : శరీరంలో ఎక్కువ కొలెస్ట్రాల్ ఉన్నవారు కూడా పెరుగు తీసుకోవడం మంచిది కాదు. పెరుగు కూడా కొవ్వు ఉంటుంది. దీని వల్ల బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మజ్జిగ తీసుకోవడం మంచిది.
ఉబ్బసం: ఉబ్బసం సమస్యతో బాధపడేవారు పెరుగు తినడం వల్ల నెమ్ము చేరుతుంది. వీరు పెరుగు అసలు తినకూడదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
Read more: Buttermilk Hidden Facts: రోజు మజ్జిగ తాగితే కొన్ని రోజుల తర్వాత ఏం జరుగుతుంది?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.