Chicken Soup: చికెన్ సూప్ రెస్టారెంట్ లోలా ఎలా తయారు చేయాలో తెలుసుకోండి..

Chicken Soup Recipe: చికెన్‌  సూప్‌ తయారు చేయడం ఎంతో మేలు చూస్తుంది. ఇందులో ఉండే పోషకాలు శరీరానికి సహాయపడుతుంది. తయారు చేయడం కూడా ఎంతో సులభం. ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.  

Written by - Shashi Maheshwarapu | Last Updated : Oct 2, 2024, 02:53 PM IST
Chicken Soup: చికెన్ సూప్ రెస్టారెంట్ లోలా ఎలా తయారు చేయాలో తెలుసుకోండి..

Chicken Soup Recipe: చికెన్‌ అంటే ఇష్టంలేనివారు ఉండరు. చికెన్‌ను ఉపయోగించి వివిధ రకాల వంటకాలను తయారు చేస్తారు. అందులో చికెన్‌ సూప్‌ ఒకటి. ఇందులో చికెన్, నీరు, కూరగాయలతో తయారు చేస్తారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన ఆహారం. దీనిని చల్లటి రోజుల్లో వేడివేడిగా తాగితే చాలా రుచిగా ఉంటుంది. అంతేకాకుండా చికెన్ సూప్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. 

చికెన్ సూప్ ప్రయోజనాలు:

వాతావరణ మార్పుల కారణంగా చాలా మంది జలుబు, దగ్గు, గొంతునొప్పులతో ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి సమయంలో చికెన్‌ సూప్‌ను తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. అంతేకాకుండా ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో ఎంతో సహాయపడుతుంది. దీని వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండవచ్చు. చికెన్ సూప్ సోయాజ్‌ను తగ్గించడానికి ఎంతో సహాయపడుతుంది. ఈ సూప్ లో ప్రోటీన్‌, కార్బోహైడ్రేట్లు, మంచి కొవ్వులు ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయి. అలసట, నీరసం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. గ్యాస్‌, అజీర్ణం వంటి జీర్ణసమస్యల నుంచి కూడా బయటపడవచ్చు. చికెన్‌ సూప్‌లను వివిధ రకాలుగా తయారు చేసుకోవచ్చు. ఇందులో కూరగాయలు కూడా కలుపుకోవచ్చు. రుచికి తగ్గట్టుగా చికెన్ సూప్‌ను కస్టమైజ్ చేసుకోవచ్చు.

ఇంట్లోనే చికెన్ సూప్ ఎలా తయారు చేయాలి?

కావలసిన పదార్థాలు:

చికెన్ ముక్కలు (బోన్‌తో ఉంటే మరింత రుచిగా ఉంటుంది)
నీరు
క్యారెట్ ముక్కలు
బీట్‌రూట్ ముక్కలు
కొత్తిమీర తీగలు
అల్లం ముక్కలు
వెల్లుల్లి రెబ్బలు
ఉప్పు
మిరియాల పొడి
నూనె
జీలకర్ర
దాల్చిన చెక్క

తయారీ విధానం:

ఒక పాత్రలో నీరు మరిగించి, అందులో చికెన్ ముక్కలు, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, దాల్చిన చెక్క వేసి మూత పెట్టి మగ్గవరకు ఉడికించాలి. చికెన్ బాగా ఉడికిన తర్వాత క్యారెట్, బీట్‌రూట్ ముక్కలు వేసి మరో 5 నిమిషాలు ఉడికించాలి. ఉప్పు, మిరియాల పొడి వేసి రుచికి తగ్గట్టుగా సర్దుబాటు చేసుకోవాలి. చిన్న పాత్రలో నూనె వేసి వేడెక్కిన తర్వాత కొత్తిమీర తీగలు వేసి వేగించి సూప్‌లో వేయాలి. సూప్ బాగా ఉడికిన తర్వాత గిన్నెల్లో వడ్డించి వెచ్చగా సర్వ్ చేయాలి.

గమనిక:

చికెన్‌ సూప్‌ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో వేడి అధికం అవుతుంది. చికెన్ ను మితంగా తినడం మంచిది. 

Also Read: Oats Facts: ఓట్స్ ఇలా తింటే గుండె జబ్బులు తప్పవా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News