ఎన్టీఆర్ కధానాయకుడిగా తెరపైకి వచ్చిన చిత్రం 'జై లవకుశ' రికార్డు స్థాయిలో వసూళ్లను రాబడుతోంది. రిలీజైన తొలి ఐదు రోజుల్లోనే దాదాపు వంద కోట్లు వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 62 కోట్లు వసూలు చేయగా.. కర్నాటకలో రూ.11 కోట్లు, తమిళనాడులో 2.25 కోట్లు...మిగిలిన ప్రాంతాల్లో రూ. 7.5 కోట్లు వసూలు చేసింది. అమెరికాలో రూ.9.08 కోట్లు వసూలు చేసింది. తొలి వారంలో ఈ చిత్రానికి పోటీ ఏదీ లేకపోవడంతో వసూళ్ల పరంగా బాగా కలిసొచ్చింది. ఈ గ్రాఫ్ ఇలాగే కొనసాగితే ఎన్టీఆర్ కెరీర్ లో అత్యధిక వసూళ్లు ఖాయమంటున్నారు విశ్లేషకులు. అయితే రేపు మహేష్‌బాబు హీరోగా నటించిన " స్పైడర్ " ..ఎల్లుండి "మహానుభావుడు" చిత్రాలు విడుదలకానున్నాయి. దీని ప్రభావం ఏ మేరకు "జై లవకుశ" పై ఉంటుందనేది సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.