Flax Seeds Remedies: అవిశె గింజలు రోజూ క్రమం తప్పకుండా తింటే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా

Flax Seeds Remedies: శరీర నిర్మాణం, ఎదుగుదల, ఆరోగ్యానికి వివిధ రకాల పోషకాలు చాలా అవసరం. అయితే ఈ పోషకాలన్నీ మన చుట్టూ ప్రకృతిలోనే లబిస్తుంటాయి. ఏవి ఎలాంటి ప్రయోజనాలు అందిస్తాయో తెలుసుకుని సేవించడం ఆరోగ్యానికి మంచిది. అలాంటివే ఈ గింజలు. ఆరోగ్యపరంగా అద్భుతమైన లాభాలుంటాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 13, 2024, 08:43 PM IST
Flax Seeds Remedies: అవిశె గింజలు రోజూ క్రమం తప్పకుండా తింటే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా

Flax Seeds Remedies: ఇటీవలి కాలంలో వివిధ రకాల సీడ్స్‌కు డిమాండ్ పెరిగింది. కారణం ఆరోగ్యపరంగా అద్భుతమైన ప్రయోజనాలు ఉండటమే. సన్‌ఫ్లవర్ సీడ్స్, చియా సీడ్స్, ఫ్లక్స్ సీడ్స్, ఆనపకాయ విత్తనాలు ఇందులో కీలకమైనవి. ఇవి చిటికెడు తీసుకున్నా అద్భుతమైన లాభాలు కలుగుతాయి. అందుకే రోజు వారీ డైట్‌లో సీడ్స్ తప్పకుండా కన్పిస్తున్నాయి. 

శరీరానికి కావల్సిన అద్భుతమైన పోషకాలను అందించే సీడ్స్‌లో ఇప్పుడు మనం ప్రముఖంగా చెప్పుకోవల్సింది అవిశె గింజలు. వీటినే ఫ్లక్స్ సీడ్స్ అంటారు. చాలా రకాల వ్యాధులకు ఇది చెక్ పెడుతుంది. ఇందులో అన్ని రకాల పోషకాలుంటాయి. ఫ్లక్స్ సీడ్స్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్,, థయామిన్, కాపర్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం పెద్దఎత్తున ఉంటాయి. ఇవి కాకుండా బి కాంప్లెక్స్ విటమిన్లు, విటమిన్ ఇ, మెగ్నీషియం, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. ఈ పోషకాలు చర్మ సంరక్షణ, ఎముకల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం కారణంగా రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. శరీరంలో రెడ్ బ్లడ్ సెల్స్ ఉత్పత్తికి కారణమౌతాయి. 

ఫ్లక్స్ సీడ్స్‌లో లిక్విఫైడ్ ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల గుండె కండరాల పనితీరు మెరుగుపడుతుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి. దాంతో గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్తపోటు నియంత్రణలో ఉండటంతో సహజంగానే గుండె పోటు ముప్పు తగ్గుతుంది. ఫ్లక్స్ సీడ్స్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను అంతం చేస్తాయి. ఫలితంగా కేన్సర్ ముప్పు కూడా తగ్గుతుంది. ఇందులో ఉండే ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ కారణంగా బ్రెస్ట్ కేన్సర్, ప్రోస్టేట్ కేన్సర్, ఇంటెస్టైన్ కేన్సర్ ముప్పు తగ్గుతుంది. 

కేవలం గుండెపోటు, రక్తపోటును నియంత్రించడమే కాకుండా బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా నియంత్రణలో ఉండేలా చేస్తుంది. ఇందులో పెద్దఎత్తున ఉండే ఫైబర్ ఆకలిని నియంత్రిస్తుంది. ఫలితంగా బరువు నియంత్రణకు దోహదం చేస్తుంది. ఇదే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియ మెరుగుపడటంతో మలబద్దకం, జీర్ణ సంబంధిత సమస్యలు దూరమౌతాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా ఇమ్యూనిటీ పెరుగుతుంది. దీనికోసం రోజూ రాత్రి వేళ కొద్గిగా ఫ్లక్స్ సీడ్స్ నీళ్లలో నానబెట్టి ఉదయం పరగడుపున తీసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే ఆరోగ్యపరంగా అద్భుతమైన మార్పులు కన్పిస్తాయి. 

Also read: Snacks for Diabetes: బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగకుండా చేసే బెస్ట్ స్నాక్స్ ఇవే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News