Parsley Tea Recipe: ప్రస్తుతకాలంలో గ్రీన్ టీ, లెమన్ టీ వంటివి చాలా మందికి ఇష్టమైన పానీయాలు. ఇందులో బోలెడు ఆరోగ్యలాభాలు ఉంటాయి. అయితే ఎప్పుడైనా మీరు కొత్తిమీర టీని ప్రయత్నించారా..? కొత్తిమీర కేవలం వంటల్లో మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. దీని పరగడుపున తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని వైద్యులు చెబుతున్నారు. అయితే ఈ టీ ఎలా తయరు చేసుకోవాలి..? దీని వల్ల ఆరోగ్యానికి ఎలాంటి లాభాలు కలుగుతాయి అనేది మనం తెలుసుకుందాం.
కొత్తిమీర రుచితో పాటు, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ముఖ్యంగా కొత్తిమీరలోని యాంటీ ఆక్సిడెంట్లు ఇతర పోషకాలు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. జీర్ణశక్తిని పెంచుతాయి, మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తాయి. ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షిస్తాయి. కొత్తిమీర రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది మధుమేహం ఉన్నవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
కొత్తిమీర టీ పీరియడ్స్:
కొంతమంది మహిళలు పీరియడ్స్ సమయంలో ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. మరి కొందరూ సమయాన్నికి పీరియడ్స్ రాకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొటారు. ఈ సమస్య ఉన్నవారు ఉదయం పరగడుపున కొత్తిమీర టీ తాగడం వల్ల నెలసరి రెగ్యులర్ గా వస్తుంది. అంతేకాకుండా కొత్తమందికి రక్తస్రావం గడ్డకట్టుంది. ఈ సమస్యకు కూడా కొత్తిమీరు సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఈ టీలోని యాంటీ-ఇన్ఫ్లమేటరీ గుణాలు కడుపు నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. పిరియడ్స్ సమయంలో కడుపు నొప్పితో బాధపడే వారికి ఇది ఉపశమనం కలిగించవచ్చు. కొత్తిమీర టీ శరీరంలోని చెడు వ్యర్థాలను తొలగించడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి, శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. ఇవన్నీ పిరియడ్స్ సమయంలో ఉపయోగకరంగా ఉండే లక్షణాలు.
ఎలా తయారు చేసుకోవాలి:
కొత్తిమీర టీ తయారీ విధానం
కొత్తిమీర టీ తయారు చేయడం చాలా సులభం. ఇంట్లోనే తాజా కొత్తిమీర ఉపయోగించి రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన కొత్తిమీర టీని తయారు చేసుకోవచ్చు.
కావలసినవి:
కొత్తిమీర ఆకులు
నీరు
తేనె లేదా నిమ్మరసం
తయారీ విధానం:
ఒక పాత్రలో నీరు తీసుకొని బాగా మరిగించాలి. మరిగే నీటిలో కొత్తిమీర ఆకులను వేసి 5-10 నిమిషాలు కడిగేలా ఉంచాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని వడకట్టి ఒక కప్పులోకి తీసుకోవాలి. రుచికి తగినట్లుగా తేనె లేదా నిమ్మరసం కలిపి తాగవచ్చు.
ముఖ్యమైన విషయాలు:
రుచిని బట్టి మీరు కొత్తిమీర పరిమాణాన్ని సర్దుబాటు చేసుకోవచ్చు.
ఎక్కువ సేపు మరిగించడం వల్ల కొత్తిమీరలోని పోషక విలువలు నాశనం అయ్యే అవకాశం ఉంది.
తాజా కొత్తిమీర ఉపయోగించడం వల్ల రుచి మరింతగా ఉంటుంది.
Also Read: Weight Loss Upma Recipe: శరీర బరువును తగ్గించే బ్రౌన్ ఉప్మా.. రుచితో పాటు ఆరోగ్యం మీ సొంతం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook