Muthyalamma idol vandalised issue protest at secunderabad: సికింద్రాబాద్ లోని ముత్యాలమ్మ ఆలయంలోని అమ్మవారి విగ్రహాన్ని ఒక వర్గానికి చెందిన వ్యక్తి కాలితో తన్నుతూ, ధ్వంసం చేశారు. దానికి సంబంధించిన ఘటన పెనుదుమారంగా మారింది. ఈ ఘటనపై హిందు సంఘాలన్ని భగ్గుమన్నాయి.ఈ నేపథ్యంలో ఘటనకు కారణమైన సలీం అనే వ్యక్తిని స్థానికలు చితకబాది.. పోలీసులకు అప్పగించారు. అతగాడు పోలీసుల విచారణలో పొంతనలేని విధంగా మాట్లాడుతున్నట్లు అధికారులు గుర్తించారు.
Secunderabad band all Hindu came together pic.twitter.com/dt9ozIneUC
— DJ RISHI (@DJRISHI44) October 19, 2024
ఈ క్రమంలో.. ఈరోజు ముత్యాలమ్మ ఆలయ విగ్రహాం ధ్వంసం ఘటనకు నిరసనగా హిందు సంఘాలు సికింద్రాబాద్ బంద్ నకు పిలుపునిచ్చాయి. అంతేకాకుండా..అమ్మవారి ఆలయం వద్దకు చేరుకుని భారీగా నినాదాలు చేస్తు నిరసనలు చేపట్టాయి. ఘటనకు కారణమైన సలీంను ఆస్పత్రిలో ఉంచారని, బొక్కలో వేసి కఠినంగా పనిష్మెంట్ ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.
#Secunderabad Bandh: protesters block Parade Ground - #TankBund road in large numbers pic.twitter.com/cfZWlBWiUg
— TOI Hyderabad (@TOIHyderabad) October 19, 2024
సలీంతో పాటు.. మరికొందరికి హిందు మతంపై ఆగ్రహం కలిగేలా సెమినార్ లు చేసుకునేందుకు అవకాశం ఇచ్చిన లాడ్జీవైపు హిందు సంఘాలు దూసుకొని వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పెద్ద ఎత్తున నిరసన కారులు అక్కడికి చేరుకుని నినాదాలు చేశారు. అయితే.. కొందరు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తు.. నిరసర కారులపై దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది.
దీంతో కొంత తొక్కిసలాట కూడా జరిగినట్లు సమాచారం. మరొవైపు.. పొలీసుల లాఠీచార్జీని మాత్రం హిందు సంఘాలు ఖండిస్తున్నారు. ఈ ఘటనపై ఇప్పటి వరకు కాంగ్రెస్ నేతలు, సీఎం రేవంత్ రెడ్డి ,మంత్రులు స్పందించకపోవడం దారుణమని హిందు సంఘాలు ఖండిస్తున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter