Samantha: శోభిత తో పెళ్లి.. ఇంస్టాగ్రామ్ లో సమంత చివరి జ్ఞాపకం చెరిపేసిన చైతూ..!

Naga Chaitanya - Samantha: ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాగచైతన్య, సమంత జంటకు ఎంతమంది అభిమానులు ఉండేవారు చెప్పనవసరం లేదు. సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా.. పెళ్లి చేసుకుని.. వారి అభిమానులను ఖుషీ చేశారు. కానీ ఆ తర్వాత వీరిద్దరూ విడాకులు తీసుకుని అందరిని ఆశ్చర్యపరిచారు. తాజాగా నాగచైతన్య.. శోభితతో పెళ్లికి సిద్ధమవుతుండగా.. సమంతతో తనకున్న చివరి జ్ఞాపకాన్ని.. కూడా తీసేశారు.
 

1 /5

నాగచైతన్య సమంతను ప్రేమించి , పెళ్లి చేసుకుని 2021 అక్టోబర్ 2న విడాకులు ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచారు. వివాహం జరిగిన నాలుగేళ్లకే విడాకులు తీసుకుంది ఈ జంట. ఆ తర్వాత నాగచైతన్య శోభితతో ప్రేమలో పడ్డారు.   

2 /5

ఏడాది ఆగస్టు 8వ తేదీన అత్యంత సన్నిహితులు,  కుటుంబ సభ్యుల మధ్య నిశ్చితార్థం చేసుకున్నారు ఈ జంట. మరొకవైపు శోభిత ధూళిపాళ పెళ్లి పనులు మొదలుపెట్టింది. పసుపు దంచడం ,గోధుమ రాయి వంటి పనులు మొదలు పెట్టినట్లు సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. 

3 /5

ఇక పెళ్లికి సిద్ధమవుతున్న నేపథ్యంలో  తాజాగా నాగచైతన్య తన మాజీ భార్య సమంతతో ఉన్న చివరి ఫోటోని కూడా సోషల్ మీడియా ఖాతా నుండి తొలగించారు.   

4 /5

ఇక ఈ ఫోటో కాస్త తొలగించడంతో అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 2018 నుండి ఒకే ఒక్క త్రో బ్యాక్ ఫోటో ని మాత్రమే మిగిల్చగా.. ఇప్పుడు ఆ ఫోటోని కూడా ఆయన తొలగించేశారు. 

5 /5

అయితే ఒక నెటిజన్ వల్లే చైతన్య ఈ ఫోటో తొలగించినట్లు సమాచారం. ఒక నెటిజన్ చైతన్య ప్లీజ్ మీరు సమంతతో ఉన్న ఫోటోని తొలగించండి. ఎందుకంటే మీరు ఇప్పుడు వేరే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకుని, పెళ్లికి సిద్ధమవుతున్నారు అంటూ కామెంట్ చేయగా చైతన్య ఆ ఫోటోని కాస్త తొలగించినట్లు సమాచారం.