Pranitha Subhash: పెళ్లి తర్వాత కథానాయికల కెరీర్ ఎండ్ కార్డ్ వేసినట్టే అని చెప్పాలి. కానీ ప్రణీత వంటి కొంత మంది మాత్రం పెళ్లై ఓ బిడ్డకు మదర్ అయినా.. గ్లామర్ విషయంలో ఎక్కడా తగ్గడం లేదు. గతంలో ఈమె షేర్ చేసిన ఫోటోలు చూస్తే ఆమె మరోసారి ప్రెగ్నెంట్ లా కనిపించింది. తాజాగా విడుదల చేసిన ఫోటోల్లో మాత్రం మాములుగా కనిపించింది.
తెలుగులో ‘ఏం పిల్లో .. ఏం పిల్లడో’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది ఈ కన్నడ కస్తూరి. ఆ తర్వాత సిద్ధార్ధ్ హీరోగా తెరకెక్కిన ‘బావ’.. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ‘అత్తారింటికీ దారేది’ సినిమాలో బాపు బొమ్మగా తెలుగు ఆడియన్స్ మనసులను దోచుకున్న సంగతి తెలిసిందే కదా.
ప్రణీత సుభాష్.. స్వతహాగా కన్నడ హీరోయిన్ అయినా.. తెలుగు సినిమాలతో మంచి నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకుంది. కన్నడలో ఈమె దర్శన్ హీరోగా నటించిన ‘పొక్కిరి’ చిత్రంతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తెలుగులో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ‘పోకిరి’ మూవీకి రీమేక్.
ఇక ‘అత్తారింటికీ దారేది’ తర్వాత మంచు ఫ్యామిలీతో చేసిన ‘పాండవులు పాండవులు తుమ్మెదా’ సినిమాలో ప్రణీత యాక్టింగ్ కు మంచి మార్కులే పడ్డాయి. అటు ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘రభస’, మహేష్ బాబుతో ‘బ్రహ్మోత్సవం’ సినిమాల్లో నటించినా.. సెకండ్ హీరోయిన్ గానే పరిమితమైంది.ఈ సినిమాలేవి బాక్సాఫీస్ దగ్గర పెద్దగా మెరుపులు మెరిపించలేదు.
సినిమాల్లో బడా స్టార్ హీరోల సరసన నటించినా.. స్టార్ డమ్ మాత్రం ప్రణీతకు దక్కలేదనే చెప్పాలి. అందుకే పెళ్లి చేసుకొని సెటిలైపోయింది. అంతేకాదు పెళ్లి తర్వాత కూడా తన గ్లామర్ ప్రదర్శనలో ఎక్కడా తగ్గడం లేదు. అంతేకాదు లాస్ట్ ఇయర్ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.
ఆ మధ్య ప్రణీత..పాంట్ సరిపోవడం లేదంటూ తన ఫోటోలను సోషల్ మీడియా మాధ్యమాల్లో షేర్ చేస్తే వైరల్ అయింది. తాజాగా మరోసారి తన లేటెస్ట్ ఫోటోలను చూస్తే అదంతా ఉత్తిత్తిదేనా అనే అనుమానాలు వస్తున్నాయి. దీనిపై ప్రణీత క్లారిటీ ఇస్తే బాగుంటుంది.