Exit Poll Results 2024 Live Updates: ఏ సర్వేలో ఏం తేలింది.. మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో అధికారం ఎవరిదంటే..?

Maharashtra and Jharkhand Exit Poll Results 2024 Live Updates: మహారాష్ట్ర,  ఝార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలపై అందరి దృష్టి నెలకొంది. నేడు పోలింగ్ జోరుగా సాగుతుండగా ఎగ్జిట్ పోల్స్‌ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.  

Written by - Ashok Krindinti | Last Updated : Nov 20, 2024, 07:50 PM IST
Exit Poll Results 2024 Live Updates: ఏ సర్వేలో ఏం తేలింది.. మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో అధికారం ఎవరిదంటే..?
Live Blog

Maharashtra and Jharkhand Exit Poll Results 2024 Live Updates: మహారాష్ట్ర,  ఝార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలు ఉత్కంఠగా జరిగాయి. మహాయుతి, మహావికాస్‌ అఘాడి కూటములు హోరాహరీ తలపడగా.. నేడు పోలింగ్ జరుగుతోంది. మహారాష్ట్రలో మొత్తం 288 నియోజకవర్గాల్లో ఒకే విడతలో పోలింగ్‌ జరగ్గా. 81 అసెంబ్లీ స్థానాలున్న ఝార్ఖండ్‌లో రెండు విడతలుగా ఎన్నికలు జరిగాయి. మహారాష్ట్రలో 288 స్థానాల్లో బీజేపీ 149 స్థానాలు, శివసేన షిండే వర్గం 81 సీట్లు, ఎన్సీపీ అజిత్ పవార్ 59 స్థానాల్లో పోటీ చేశాయి. ఇక మహావికాస్ అఘాడీ నుంచి కాంగ్రెస్ 101 సీట్లు, శివసేన ఉద్ధవ్‌ ఠాక్రే వర్గం 95 సీట్లు, ఎన్సీపీ శరద్‌పవార్‌ 86 సీట్లలో తలపడుతున్నారు. ఝార్ఖండ్‌లో ఇండియా కూటమిలోని కాంగ్రెస్ 30 సీట్లలో, జేఎంఎం 42, ఆర్జేడీ 6, సీపీఐఎంఎల్‌ 3 చోట్ల పోటీ చేస్తున్నాయి. ఎన్డీఏ కూటమి 81 సీట్లలో తలపడుతోంది. ఈ నెల 23న ఫలితాలు విడుదల కానుండగా.. రెండు రాష్ట్రాల్లో ఎవరు కింగ్ మేకర్ అవుతారో ఎగ్జిట్‌ పోల్స్ అంచనా వేస్తున్నాయి. మహారాష్ట్ర, ఝార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
 

20 November, 2024

  • 19:49 PM

    Jharkhand Exit Poll Results 2024 Live Updates: ఝార్ఖండ్‌లో బీజేపీ 40-44 సీట్లు, ఇండి కూటమి 20-40 సీట్లు, ఇతరులు ఒక సీటు గెలుచుకుంటారని టైమ్స్‌ నౌ-జేవీసీ వెల్లడించింది.

  • 19:38 PM

    Maharashtra Exit Poll Results 2024 Live Updates: రిపబ్లిక్ సర్వేలో మహాయుతి 150 నుంచి 170 సీట్లు, మహా వికాస్ ఆఘాఢీ  110 నుంచి 130 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది. ఇతరులు 8 నుంచి 10 సీట్లలో విజయం సాధించే అవకాశం ఉందని తెలిపింది.

  • 19:27 PM

    Jharkhand Exit Poll Results 2024 Live Updates: యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ ప్రకారం.. జార్ఖండ్‌లో ఇండి కూటమి 53 స్థానాల్లో, NDA 25 స్థానాల్లో గెలుస్తుందని అంచనా వేసింది. ఇతరులు మూడు సీట్లు గెలుస్తారని వెల్లడించింది.

  • 19:17 PM

    Jharkhand Exit Poll Results 2024 Live Updates: ఝార్ఖండ్‌లో మరోసారి ఇండి కూటమికే పట్టం కట్టింది ఆత్మసాక్షి. జేఎంఎం కూటమి 43 నుంచి 45 సీట్లు సాధించే అవకాశాలున్నట్లు ఆత్మసాక్షి వెళ్లడించింది. ఇక బీజేపీ ఎన్డీఏ కూటమికి 36 నుంచి 38 సీట్లు వచ్చే అవకాశముందని తెలిపింది. అలాగే 2 నుంచి 3 సీట్లు ఇతరులకు దక్కే అవకాశముంది. దీంతో మరోసారి ఝార్ఖండ్‌లో హేమంత్ సోరెన్‌ సీఎం పగ్గాలు చేపట్టే అవకాశాలున్నట్లు ఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్‌ పేర్కొంది. 

  • 19:16 PM

    Maharashtra Exit Poll Results 2024 Live Updates: మహారాష్ట్రలో మహావికాస్‌ అఘాడీ కూటమికే ఎగ్జిట్‌ పోల్స్‌ పట్టం కట్టాయి. ఆత్మసాక్షి ప్రకారం మహావికాస్‌ అఘాడీకి 147 నుంచి 155 సీట్లు గెలుస్తుందని అంచనా వేసింది. అలాగే మహాయుతి కూటమికి 127 నుంచి 137 సీట్లు సాధించే అవకాశాలున్నట్లు అంచనా వేసింది. ఇక ఇతరులకు 10 నుంచి 13 సీట్లు గెలుచుకుంటాయని భావిస్తోంది. ఇక ఓటింగ్ షేర్‌లో 45 నుంచి 46 శాతం ఓట్లను మహావికాస్ అఘాడీకి, మహాయుతి కూటమి 43 నుంచి 44శాతం ఓట్లు దక్కే అవకాశముందని అంచనా వేసింది. 
     

  • 18:52 PM

    Jharkhand Exit Poll Results 2024 Live Updates: పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాల ప్రకారం.. ఝార్ఖండ్‌లో బీజేపీ 42.1 శాతం, ఏజేఎస్‌యూ 4.6 శాతం, కాంగ్రెస్ 16.2 శాతం, జేఎమ్ఎమ్ 20.8 శాతం, ఇతరులు 16.3 శాతం ఓట్లు పొందనున్నాయి. ఈ సర్వే ఫలితాల్లో మూడు శాతం ప్లస్ ఆర్ మైనస్ ఉండే అవకాశాలున్నాయి.
     

  • 18:51 PM

    Jharkhand Exit Poll Results 2024 Live Updates: జార్ఖండ్‌ ఎన్నికల్లో ఎన్డీఏ జయకేతనం ఎగురవేస్తుందని పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ ఎగ్జిట్ పోల్ అంచనా వేస్తోంది. 81 స్థానాలున్న ఝార్ఖండ్‌లో బీజేపీ 42 నుంచి 48 స్థానాలు, ఏజేఎస్‌యూ 2 నుంచి 5 స్థానాలు, కాంగ్రెస్ 8 నుంచి 14,  జేఎమ్ఎమ్16 నుంచి 23 స్థానాలు, ఇతరులు 6 నుంచి 10 స్థానాలు పొందే అవకాశాలున్నాయని ఎగ్జిట్ పోల్ సర్వేలో తేలింది.  
     

  • 18:50 PM

    Maharashtra Exit Poll Results 2024 Live Updates: మహారాష్ట్రలో మహాయుతికి 49.8 శాతం, మహావికాస్ అఘాడీకి 40.1 శాతం, ఇతరులకు 10.1 శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నాయి. ఇక ముఖ్యమంత్రిగా ఎవరికి ప్రాధాన్యతిస్తారని ఓటర్లను ప్రశ్నించగా ఏక్‌నాథ్‌ శిండేకు 35.8 శాతం, ఉద్దవ్ ఠాక్రేకు 21.7 శాతం, దేవంద్ర ఫడ్నవీస్‌కు 11.7 శాతం, రాజ్‌థాక్రేకు 2.9 శాతం ఓటర్లు మద్దతిచ్చారు. రాష్ట్రంలో మహిళలు మద్దతు మహాయుతికే లభించింది. మహాయుతికి పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా మద్దతు లభించింది. సామాజిక వర్గాల వారీగా పరిశీలిస్తే ముస్లింలు ఎమ్వీకే మద్దతివ్వగా,  ఓబీసీలు మహాయుతివైపు మొగ్గు చూపారు. ఎస్సీల్లో రెండు కూటములకు దాదాపు సమానంగా మద్దతు లభించింది. ఎస్టీలు మహాయుతికే మద్దతు ప్రకటించారు. బౌద్దుల మద్దతు రెండు కూటములకు సమానంగా వచ్చే అవకాశాలున్నాయి. 

    ప్రాంతాల వారీగా పరిశీలిస్తే ఉత్తర మహారాష్ట్ర, మరఠ్వాడా, విదర్భ, పశ్చిమ మహారాష్ట్ర, కొంకణ్, ముంబైయి రీజియన్లలో మహాయుతి ఆధిపత్యం కనబరిచింది. లోక్‌సభ ఎన్నికల్లో విదర్భ, ముంబై ప్రాంతాల్లో కాంగ్రెస్ ఆధిక్యత సాధించినా, అసెంబ్లీ ఎన్నికల నాటికి పరిస్థితులు పూర్తిగా మారడంతో మహాయుతికి అవకాశాలు మెరుగైనట్లు భావిస్తున్నారు.  

  • 18:48 PM

    Maharashtra Exit Poll Results 2024 Live Updates: మహారాష్ట్రలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశాలున్నట్లు పీపుల్స్‌పల్స్‌ ఎగ్జిట్ పోల్స్‌ వెళ్లడిస్తోంది. పార్టీల వారీగా బీజేపీ 102 నుంచి 120 సీట్లు, శివసేన షిండే వర్గం 42 నుంచి 61 సీట్లు, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గానికి 14 నుంచి 25 సీట్లు దక్కే అవకాశముందని అంచనా వేసింది. మహావికాస్‌ అఘాడీలోని కాంగ్రెస్‌ పార్టీకి 24 నుంచి 44 స్థానాలు, శివసేన ఉద్ధవ్‌ థాక్రే వర్గానికి 21 నుంచి 36 సీట్లు, ఎన్సీపీ శరద్ పవార్‌ వర్గానికి 28 నుంచి 41 సీట్లు వచ్చే అవకాశాలున్నాయి. 
     

  • 18:47 PM

    Maharashtra Exit Poll Results 2024 Live Updates: మహారాష్ట్రలో మహాయుతి కూటమికి పట్టం కట్టింది పీపుల్స్ పల్స్‌. 288 స్థానాలున్న మహారాష్ట్రలో మెజార్టీకి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 145. పీపుల్స్‌ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వే  ప్రకారం మహాయుతి కూటమికి 175 -195 సీట్లు, మహావికాస్‌ అఘాడీ కూటమికి 85-112 సీట్లు, ఇతరులకు 7 నుంచి 12 సీట్లు వచ్చే అవకాశాలున్నాయి. 
     

  • 18:46 PM

    Jharkhand Exit Poll Results 2024 Live Updates: జార్ఖండ్‌లో బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని MATRIZE ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. BJP+కి 45% ఓట్లు, 42-47 సీట్లు వస్తాయని వెల్లడించింది. కాంగ్రెస్ కూటమి 25 నుంచి 30 సీట్లు గెలుచుకోవచ్చని తెలిపింది. ఇతరులు 1 నుంచి 4 సీట్లు గెలుచుకోవచ్చని అంచనా వేసింది. కాంగ్రెస్+ 38 శాతం ఓట్లు సాధిస్తుందని పేర్కొంది.

  • 18:44 PM

    Maharashtra Exit Poll Results 2024 Live Updates: మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని MATRIZE ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. BJP+కి 48% ఓట్లు, 150-170 సీట్లు వస్తాయని జోస్యం చెప్పింది. కాంగ్రెస్ 110 నుంచి 130 సీట్లు, ఇతరులు 8 నుంచి 10 సీట్లు గెలుచుకోవచ్చని వెల్లడించింది. కాంగ్రెస్+ 42 శాతం ఓట్లు సాధిస్తుందని తెలిపింది. 

Trending News