Hair Care Masks: మీ కేశాల్ని అందంగా మృదువుగా నిగనిగలాడేలా చేసే 5 బెస్ట్ హోమ్ మేడ్ మాస్క్‌‌లు

Hair Care Masks: ఇటీవలి కాలంలో ఆధునిక జీవనశైలి లేదా వివిధ రకాల ఆహారపు అలవాట్ల కారణంగా కేశాల సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి. జుట్టు రాలడం, తెల్లబడటం, నిర్జీవంగా ఉండటం ఇలా వివిధ రకాల సమస్యలు మీ అందంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంటాయి. అయితే సహజసిద్ధంగా హెయిర్ మాస్క్ తయారు చేసుకుంటే కేశాల్ని అద్భుతంగా సంరక్షించుకోవచ్చు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 27, 2024, 06:38 PM IST
Hair Care Masks: మీ కేశాల్ని అందంగా మృదువుగా నిగనిగలాడేలా చేసే 5 బెస్ట్ హోమ్ మేడ్ మాస్క్‌‌లు

Hair Care Masks: కేశాల సమస్యలకు ప్రధాన కారణం పోషకాల లోపం. రెండవది కాలుష్యం. ప్రస్తుతం ఆధునిక జీవన విధానంలో జుట్టు త్వరగా తెల్లబడటం, జుట్టు రాలుతుండటం, డ్రైగా మారి కళ కోల్పోవడం వంటి సమస్యలు తరచూ చూస్తున్నాం. ఈ సమస్యలన్నింటికి సమాధానమే ఈ హోమ్ మేడ్ మాస్క్. అదెలాగో తెలుసుకుందాం.

ప్రతి ఒక్కరికీ జుట్టు అందంగా ఉండాలని, నల్లగా నిగనిగలాడుతుండాలని ఉంటుంది. ఎందుకంటే అందంగా ఉండాలంటే కేశాలు చాలా కీలకం. కేశాలు నిర్జీవంగా ఉంటే అందమే పోతుంది. స్కాల్ప్ నుంచి ఉత్పత్తి అయ్యే నేచురల్ ఆయిల్ తగ్గడం, సీజన్ మార్పు, తరచూ షాంపూతో స్నానం, కేశాల్లో తేమను పోగొట్టే కెమికల్స్ వాడకం వల్ల జుట్టు డ్రైగా మారిపోతుంటుంది. పోషకాల లోపం మరో ప్రధాన కారణం. అందుకే కేశాల్ని ఎప్పటికప్పుడు ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా చాలా అవసరం. దీనికోసమే ఈ హోమ్ మేడ్ మాస్క్. ఇది కేశ సంరక్షణకు అద్భుతంగా పనిచేస్తుంది. 

కొబ్బరి నూనెలో ఫ్యాటీ యాసిడ్స్ పెద్దఎత్తున ఉండటం వల్ల కేశాల సాఫ్ట్ టిష్యూలో ప్రవేశించి ఆరోగ్యంగా మారుస్తాయి. వారంలో రెండు సార్లు వేడి కొబ్బరి నూనెతో తలకు మాలిష్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. కేశాలు త్వరగా ఎదుగుతాయి. కుదుళ్ల నుంచి గట్టిదనం వస్తుంది. రెండవది అల్లోవెరా జెల్. బెస్ట్ హైడ్రేటింగ్ రెమిడీ ఇది. స్కాల్ప్ పీహెచ్ లెవెల్ బ్యాలెన్స్ చేస్తుంది. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ వల్ల సెల్స్ ఉత్పత్తి పెరుగుతుంది. ఫలితంగా జుట్టు కుదుళ్లు పటిష్టంగా మారతాయి. 

మూడవది బనానా మాస్క్. ఇందులో పొటాషియం, విటమిన్లు, నేచురల్ ఆయిల్ పెద్దఎత్తున ఉంటాయి. ఇవి కేశాలను మృదువగా, నిగనిగలాడేట్టు చేస్తాయి. కేశాలను సహజసిద్ధంగా ఎలాస్టిసిటీ పొందేందుకు దోహదం చేస్తుంది. ఫలితంగా జుట్టు తెగడం, రాలడం వంటి సమస్యలు తొలగిపోతాయి. ఈ మాస్క్ తయారీకు ఒక అరటి పండు, ఒక స్పూన్ తేనె, ఒక స్పూన్ కొబ్బరి నూనె లేదా జైతూన్ ఆయిల్ కలిపి మిశ్రమంగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు రాసుకుని కనీసం 30 నిమిషాలు వదిలేయాలి. ఆ తరువాత చల్ల నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఇక నాలుగో హోమ్ మేడ్ రెమిడీ ఎగ్ మాస్క్. ఇందులో ప్రోటీన్లు, విటమిన్లు, ఫ్యాటీ యాసిడ్స్ పెద్దఎత్తున ఉంటాయి. ఇవి కేశాల్ని పటిష్టంగా మాయిశ్చరైజ్ చేస్తాయి. ఇందులో ఉండే లెసిథిన్ కేశాల్ని పూర్తిగా కండీషనింగ్ చేస్తాయి. జుట్టు నిగనిగలాడేట్టు చేస్తుంది. 1-2 గుడ్లలో పసుపు భాగాన్ని తీసుకుని అందులో జైతూన్ లేదా కొబ్బరి నూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి 20 నిమిషాలుంచాలి. ఆ తరువాత చల్ల నీటితో స్నానం చేయాలి.

ఇక ఐదవది జైతూన్ ఆయిల్. ఇది బెస్ట్ నేచురల్ హెయిర్ కండీషనర్. కేశాలకు కావల్సిన పోషకాల్ని అందిస్తుంది. హైడ్రేట్‌గా ఉండేట్టు చేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ ఎ, విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు పాడైన కేశాలను సరిచేస్తాయి. డ్రై కాకుండా కాపాడుతాయి. 2-3 చెంచాలు జైతూన్ ఆయిల్ తీసుకుని వేడి చేసి స్కాల్ప్, కేశాలకు బాగా పట్టించాలి. ఆ తరువాత తలను కవర్ చేసి ఉంచాలి. ఓ అరగంట తరువాత మైల్డ్ షాంపూతో స్నానం చేయాలి. ఇలా ఈ 5 విధానాలతో వారానికి 2-3 సార్లు చేస్తే మంచి ఫలితాలుంటాయి. 

Also read: Honey-Turmeric Benefits: తేనె, పసుపు కలిపి సేవిస్తే ఈ 5 వ్యాధులకు చెక్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News