Mosquitoes: చలి వేళ దోమల గోల.. ఈ మొక్కతో ఆమాడ దూరం పరార్‌..

Mosquitoes Repellent: తెలుగు రాష్ట్రాల్లో  ఉష్ణోగ్రతలు పడిపోయాయి... దీంతో సీజనల్ జబ్బులు కూడా చుట్టూ ముడుతున్నాయి. అయితే మరోవైపు దోమల విజృంభిస్తున్నాయి, ప్రాణాంతక వ్యాధులు చుట్టూ ముడతాయి. ఇంట్లో కొన్ని రకాల మొక్కలు పెట్టుకుంటే మీ ఇంటి దరిదాపుల్లోకి దోమలు రావు. దోమలకు ఆ మొక్కలంటే భయం ఆమడ దూరం పారిపోతాయి ఆ మొక్కలు మీ ఇంట్లో ఉన్నాయా మరి...?

Written by - Renuka Godugu | Last Updated : Dec 1, 2024, 01:47 PM IST
Mosquitoes: చలి వేళ దోమల గోల.. ఈ మొక్కతో ఆమాడ దూరం పరార్‌..

Mosquitoes Repellent: దోమలకు ఈ నాలుగు మొక్కలు అంటే భయం.. ఆమడ దూరం పారిపోతాయి.చలి పెరిగిపోతుంది తుఫాను బీభత్సం కూడా సృష్టిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో  ఉష్ణోగ్రతలు పడిపోయాయి... దీంతో సీజనల్ జబ్బులు కూడా చుట్టూ ముడుతున్నాయి. అయితే మరోవైపు దోమల విజృంభిస్తున్నాయి, ప్రాణాంతక వ్యాధులు చుట్టూ ముడతాయి. బంతి పువ్వు..
బంతి పువ్వు మొక్క అంటే దోమలకు భయం. ఇవి వికర్షకాలుగా పనిచేస్తాయి. బంతి పువ్వు మొక్క ఎంతో అందంగా కనిపిస్తుంది... ఇందులో పాలియో ఉంటుంది ఇవి దోమలకు వికర్షలుగా పని చేస్తాయి... మొక్కను చూస్తే దోమలు దూరంగా పారిపోతాయి మీ ఇంటి దరిదాపులోకి రావు. బంతి పువ్వు మొక్కను చిన్న చిన్న కుండల్లో కూడా పెంచుకోవచ్చు. మీ ఇంటి బాల్కనీ అందాన్ని పెంచడంతోపాటు మీ ఇంటి దరిదాపుల్లోకి దోమలను రానివ్వదు. బంతి పువ్వు చలికాలంలో దోమలను దూరంగా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది..

లావెండర్..
లావెండర్ సువాసన భరితంగా ఉంటుంది. దీన్ని పెర్ఫ్యూమ్లలో ఉపయోగిస్తారు. లావెండర్ దోమలను కూడా దూరంగా ఉంచుతుంది... లెవెండర్ మొక్కను ఇంటి చుట్టూ ముట్టు పెంచుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా దోమలకు వికర్షణలుగా పని చేస్తుంది. కొన్ని నివేదికల ప్రకారం లావెండర్ మొక్క వల్ల స్ట్రెస్ కూడా తగ్గిపోతుంది. మూడ్‌ బూస్టింగ్ గుణాలు కలిగి ఉంటాయి. లావెండర్ ఆయిల్ కూడా మార్కెట్లో సులభంగా దొరుకుతుంది. వీటిని సువాసన చూడటం వల్ల కూడా ఆందోళన తగ్గుతుంది. లావెండర్ మొక్క ఆయిల్ మనము శరీరానికి రుద్దుకోవడం వల్ల దోమలు కాటు వేయకుండా ఉంటాయి.

ఇదీ చదవండి: ములుగులో భారీ ఎన్‌కౌంటర్‌.. ఏడుగురు మావోయిస్టుల హతం..  

తులసి మొక్క..
తులసి మొక్క కూడా ప్రతి ఇంట్లో ఉంటుంది. దీని ఆధ్యాత్మిక పరంగా పూజలు చేస్తాం. తులసి మొక్క ఇంట్లో పాజిటివిటీ పెంచడమే కాదు దోమలను కూడా దూరంగా ఉంచుతుంది... తులసి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. తులసి ఆకుతో టి తీసుకుంటారు. అంతేకాకుండా పరగడుపున తులసి ఆకును తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అయితే తులసి మొక్క ఇంటి చుట్టూ ఉన్న ప్రాంతంలో దోమలు రావు... తులసి మొక్క కూడా దోమలకు వికర్షలుగా పని చేస్తుంది. చిన్న బకెట్ లో లేకపోతే కుండలో ఈ సులభంగా పెంచుకోవచ్చు.

లెమన్ గ్రాస్..
లెమన్ గ్రాస్ మొక్క అంటే కూడా దోమలకు భయం దూరంగా పారిపోతాయి. ఇది ఈ మొక్క దోమలకు వికర్షలుగా పనిచేస్తుంది... వీటిని కూడా సులభంగా కుండలో పెంచుకోవచ్చు. లెమన్ క్రాస్ ఇంటి బాల్కనీలో పెంచుకోవడం వల్ల అందంగా ఉండటమే కాకుండా దోమలను తరిమేస్తుంది. లెమన్ గ్రాస్ మొక్కతో కూడా అనేక ప్రయోజనాలు ఉంటాయి. వీటిని డైట్ లో చేర్చుకుంటారు..

ఇదీ చదవండి:  ఈ 7 ఆహారాల్లో పాలకూర కంటే పుష్కలంగా ఐరన్ ఉంటుంది.. మీ శరీరానికి తక్షణ శక్తినిస్తాయి..

ఇది కాకుండా రోజ్మెరీ మొక్క వల్ల కూడా దోమలు దూరంగా పారిపోతాయి. ఇది కూడా దోమలకు వికర్షణలుగా పని చేస్తుంది... రోజ్మెరీ మొక్క ఇంటికి చుట్టూ పెంచుకోవడం వల్ల సువాసన భరితంగా ఉండటమే కాకుండా దోమలను తరిమేస్తుంది.. ఆ రోజ్మెరీ మొక్క వల్ల జుట్టుకు కూడా ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. వివిధ హెయిర్ కేర్ ఉత్పత్తుల్లో కూడా ఉపయోగిస్తారు. హెయిర్ ఫాల్ సమస్యకు సరైన రెమెడీ రోజ్మెరీ..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News