Pink Fruit: ఈ పండు మధుమేహం ఉన్నవారికి వరం లాంటిది.. ఎక్కడ దొరికిన వదలకండి..

Pink Fruit For Diabetes: ప్రతిరోజు పింక్ జామను తినడం వల్ల శరీరానికి ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అయితే దీనిని మధుమేహం ఉన్నవారు తినొచ్చా? పింకు జామును మధుమేహం ఉన్నవారు కూడా తినొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనిని తినడం వల్ల విశేషమైన ప్రయోజనాలు పొందుతారు.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Dec 1, 2024, 06:13 PM IST
Pink Fruit: ఈ పండు మధుమేహం ఉన్నవారికి వరం లాంటిది.. ఎక్కడ దొరికిన వదలకండి..

Pink Fruit For Diabetes In Telugu: సంపూర్ణ ఆరోగ్యానికి ప్రపంచంలో ఉన్న పండ్లు కీలక పాత్ర పోషిస్తాయి. పండ్లలో వివిధ రకాల పోషకాలు ఉంటాయి కాబట్టి ఇవి శరీరానికి అద్భుతమైన లాభాలను అందిస్తాయి. ముఖ్యంగా జామపండు అయితే ఈ యాప్ కంటే ఎక్కువ పోషకాలు ఉంటాయి. అందుకే దీనిని పేద వాడి యాపిల్ పండుగా పిలుస్తారు. మరికొన్ని దేశాల్లోనైతే.. దీన్ని సూపర్ ఫుడ్‌గా కూడా పిలుస్తారు. అయితే ప్రస్తుతం మార్కెట్లో జామకాయ వివిధ రకాల వేరియంట్లలో లభిస్తుంది. మనం చాలావరకు తెలుపు రంగుతో కూడిన జామ పండును చూస్తూ ఉంటాము. కానీ కొన్ని కొన్నిచోట్ల పింక్ కలర్ తో కూడిన జామ పనులు కూడా ఉంటాయి. అయితే వీటిని మధుమేహం ఉన్నవారు తినవచ్చా? 

పింకు జామ పండులో వైట్ జామ పండు కంటే ఎక్కువ పోషకాలు ఉంటాయని కొంతమంది ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తెల్లజామలు స్టార్చ్, విటమిన్ సి, విత్తనాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దీనిని ప్రతిరోజు తినడం వల్ల అద్భుతమైన లాభాలు పొందుతారు. అలాగే పింకు జామలో తక్కువ చక్కెర పరిమాణాలు, విటమిన్ సి, కార్బస్ కూడా తక్కువగా ఉంటుంది. ఇక ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ ఎక్కువ మోతాదులో లభిస్తాయి. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు రోజు తినడం వల్ల మంచి లాభాలు పొందుతారు. ముఖ్యంగా సీజనల్ వ్యాధులతో బాధపడేవారు దీనిని తినడం వల్ల గొప్ప రక్షణ పొందుతారు. రోగ నిరోధక శక్తి కూడా ఒక్కసారిగా పెరుగుతుంది.

పింక్ జామను మధుమేహం ఉన్నవారు కూడా తినవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో విటమిన్లతోపాటు కొన్ని శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు లభిస్తాయి. కాబట్టి రోజూ తినడం వల్ల జలుబు దగ్గు వంటి సమస్యలు కూడా దూరమవుతాయి. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు దీనిని ప్రతిరోజు తినవచ్చు. ఎందుకంటే ఇందులో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఇది క్యాన్సర్ ను నివారించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తరచుగా జీర్ణ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ పింక్ జామను తినడం వల్ల విశేషమైన లాభాలు పొందుతారు. అలాగే ఇది మలబద్ధకాని నియంత్రించేందుకు కూడా ఎంతగానో సహాయపడుతుంది. 

పింకు జామలు పొటాషియంతో పాటు ఇతర మూలకాలు కూడా ఎక్కువ మోతాదులో లభిస్తాయి. కాబట్టి ప్రతిరోజు ఉదయం పూట తినడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. దీంతోపాటు గుండె సమస్యలు కూడా రాకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే ఇందులో ఫైబర్ పుష్కలంగా.. కేలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి ఇది బరువు తగ్గించేందుకు కూడా ఎంతో సహాయపడుతుంది. అలాగే ఇందులో ఉండే నీటి కంటెంట్ చర్మాన్ని ఆరోగ్యవంతంగా చేసేందుకు కూడా సహాయపడుతుంది. దీంతోపాటు రాడికల్స్‌ను తొలగించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు పింక్ జామను తినడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

ఇదీ చదవండి: మాజీ మంత్రి ఎన్సీపీ లీడర్‌ బాబా సిద్ధిఖీ దారుణ హత్య.. సల్మాన్‌ ఖాన్‌కు ఈ మర్డర్‌తో ఉన్న లింక్‌ అదేనా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News