K Kavitha Catches Fish Pic Goes Viral: జైలు జీవితం నుంచి కోలుకున్న మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజకీయంగా దూకుడు పెంచుతున్నారు. ఈ క్రమంలో వివిధ సామాజిక వర్గాలతో భేటీ అవుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న మోసాలపై పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఆమె ఇంట్లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది.
మళ్లీ దూకుడు: అక్రమ కేసులో జైలు నుంచి బయటకు వచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మళ్లీ రాజకీయాల్లో దూకుడు పెంచారు.
గంగపుత్రులతో భేటీ: హైదరాబాద్లోని తన నివాసంలో కె కవిత గంగపుత్ర సంఘం ప్రతినిధులతో సమావేశమయ్యారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ , బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ముఠా జై సింహా ఉన్నారు.
ధన్యవాదాలు: తెలంగాణ జాగృతి తరఫున బీసీ డెడికేటెడ్ కమిషన్కు నివేదిక సమర్పించిన ఎమ్మెల్సీ కవితకి గంగపుత్ర నాయకులు ధన్యవాదాలు తెలిపారు.
కుల వృత్తి: ఈ సందర్భంగా మత్య్సకారులు తమ కుల వృత్తికి సంబంధించిన వల.. చేపలను కవితకు ఇచ్చి సత్కరించారు.
చేపలు బహూకరణ: ఈ సందర్భంగా కోరమీను.. మరో రకం చేపలను కవిత ఆసక్తిగా గమనించారు. చేపల పెంపకం.. పట్టడం వంటి వివరాలు ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు.
మండలిలో గొంతెత్తాలి: ఈ సందర్భంగా గంగపుత్ర నాయకులు తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఎమ్మెల్సీ కవిత దృష్టికి తీసుకెళ్లారు. శాసనమండలిలో లేవనెత్తాలని గంగపుత్రులు విజ్ఞప్తి చేశారు.