Revanth Reddy: హైదరాబాద్‌లో ఐటీ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ చేసిందే! రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Revanth Reddy Says Hyderabad IT Developed By Congress Party: అంతర్జాతీయ నగరాలకు సమానంగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తుంటే.. బీఆర్‌ఎస్‌ పార్టీ, బీజేపీలు కాళ్లల్లో కట్టె పెట్టాలని చూస్తున్నాయని రేవంత్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్‌, కిషన్‌ రెడ్డిలపై మండిపడ్డారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Dec 3, 2024, 07:28 PM IST
Revanth Reddy: హైదరాబాద్‌లో ఐటీ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ చేసిందే! రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Hyderabad IT Develop: విశ్వనగరంగా హైదరాబాద్‌ను  తీర్చిదిద్ది ప్రపంచ నగరాలతో సమానంగా నగరాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నట్లు రేవంత్‌ రెడ్డి తెలిపారు. 'హైదరాబాద్ అంటే రాష్ట్రానికే కాదు.. ప్రపంచంలోనే ఒక గుర్తింపు ఉంది' అని ముఖ్యమంత్రి తెలిపారు. హైదరాబాద్‌లో ఐటీ అభివృద్ధికి పునాదులు వేసింది కాంగ్రెస్ పార్టీ అని ప్రకటించారు. తమ పార్టీ ముందుచూపుతో వ్యవహరించడంతోనే హైదరాబాద్‌లో చాలా సమస్యలు పరిష్కారమైనట్లు వెల్లడించారు.
Also Read: Harish Rao: 'నువ్వు లక్ష తప్పుడు కేసులు పెట్టించినా రేవంత్‌ రెడ్డి నిన్ను వదల?

అధికారంలోకి వచ్చి ఏడాదవుతున్న సందర్భంగా హైదరాబాద్‌లో మంగళవారం నిర్వహించిన ఉత్సవాల్లో రేవంత్‌ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ పార్టీ, బీజేపీలపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా మాజీ మంత్రి కేటీఆర్‌తోపాటు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డిపై మండిపడ్డారు. ఈ సమావేశం వేదిక నుంచి ఆ రెండు పార్టీలకు సంచలన సవాల్‌ చేశారు. హైడ్రా విషయంలో మరేదైనా ప్రత్యేక ప్రణాళిక ఉంటే తీసుకురావాలని కోరారు.
Also Read: Osmania Hospital: ప్రజలకు వైద్యపరంగా గుడ్‌న్యూస్‌.. 15 రోజుల్లో ఉస్మానియాకు కొత్త భవనం

'హైదరాబాద్‌లో తాగు నీటి సమస్య పరిష్కరించడానికి కృష్ణా జలాలనే కాదు.. గోదావరి జలాలను తీసుకొచ్చిన ఘనత మాది. హైదరాబాద్‌కు మెట్రోను తీసుకొచ్చేందుకు ఆనాడు కేంద్రమంత్రిగా జైపాల్ రెడ్డి కృషి చేశారు. అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ కృషి వల్లే హైదరాబాద్ నగరానికి పెట్టుబడులు వచ్చాయి' అని రేవంత్‌ రెడ్డి చిట్టా విప్పారు. రూ.35 వేల కోట్లతో 360 కిలో మీటర్ల రీజనల్ రింగ్ రోడ్డు తెలంగాణకు మణిహారంగా నిర్మించబోతున్నట్లు తెలిపారు. రీజనల్ రింగ్ రోడ్డు నుంచి రేడియల్ రోడ్లు నిర్మించి నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు.

'ఇబ్రహీంపట్నంలో అంతర్జాతీయ ఫ్రూట్ మార్కెట్‌లో కోల్డ్ స్టోరేజీల ఏర్పాటు. 40 నుంచి 50వేల ఎకరాల్లో ప్రపంచంలోని అంతర్జాతీయ నగరాలకు ధీటుగా ఫ్యూచర్ సిటీ నిర్మిస్తాం' అని ముఖ్యమంత్రి తెలిపారు. పదేళ్లలో నగరానికి కావాల్సిన శాశ్వత అభివృద్ధిని గత ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. ఈ సందర్భంగా దేశంలోని ప్రధాన నగరాలపై విమర్శలు చేశారు. 'ఢిల్లీ పూర్తిగా కాలుష్యం.. ముంబై, చెన్నైలో వరదలు.. బెంగుళూరులో గంటలకొద్దీ ట్రాఫిక్.. కలకత్తాలో ఉన్నన్ని సమస్యలు ఎక్కడా లేవు' అని రేవంత్ రెడ్డి వివరించారు.

'దేశంలో ఏ నగరాన్ని చూసినా సమస్యలమయమే. ఆ నగరాల నుంచి మనం నేర్చుకోవాలి? హైదరాబాద్ నగరం అలా మారకుండా జాగ్రత్త పడాలి. దానికోసమే మూసీ పునరుజ్జీవనం జరగాలి. నగరంలో వరదల నియంత్రణకు రోడ్లపై వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ నిర్మిస్తున్నాం' అని రేవంత్‌ రెడ్డి వెల్లడించారు. నగరంలోని 141 ప్రాంతాల్లో వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ నిర్మించాలని అధికారులకు ఆదేశించినట్లు తెలిపారు. ఎంత మంది ఎంత విష ప్రచారం చేసినా రియల్ ఎస్టేట్ పడిపోయిందని ప్రచారం చేసినా మేం వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News