Osmania Hospital: ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఉస్మానియా ఆస్పత్రి కొత్త భవన నిర్మాణానికి ముందడుగు పడింది. అతి పురాతనమైన ఆస్పత్రి భవనం కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో నాటి సీఎం కేసీఆర్ కొత్త భవనం నిర్మించడానికి ప్రణాళికలు రచించగా.. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ముందుకు తీసుకెళ్తోంది. అయితే పాత భవనంలో కాకుండా కొత్త ప్రాంతంలో ఈ ఆస్పత్రి భవనం నిర్మించేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా వైద్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కీలక ప్రకటన చేశారు. 15 రోజుల్లో ఆస్పత్రి నిర్మాణ పనులు ప్రారంభిస్తామని ప్రకటించారు.
Also Read: Kodada: ఎమ్మెల్యే పద్మావతికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భారీ గిఫ్ట్.. ఏమిటో తెలుసా?
విద్యా వైద్యం సోషల్ సెక్యూరిటీపై కాంగ్రెస్ ప్రభుత్వానికి బాధ్యత ఉందని దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయం మీడియా పాయింట్‌లో సోమవారం కీలక విషయాలు తెలిపారు. 'ఆరోగ్య శ్రీ ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పేదల కోసమే' అని తెలిపారు. 50 పడకల ఆసుపత్రి ఉన్న వాటికి సైతం ఆరోగ్యశ్రీ పథకం వర్తించే విధంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
Also Read: Auto Jac Bandh: హైదరాబాద్ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఆరోజు నగరంలో ఆటోలు బంద్
'పది నిమిషాల్లోనే అంబులెన్స్ సంఘటనా స్థలానికి వచ్చేలా చర్యలు తీసుకుంటాం. బ్లాక్ స్పాట్స్ గుర్తింపు.. అక్కడ అంబులెన్స్ ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్నట్లు' దామోదర రాజనర్సింహ వెల్లడించారు. ప్రతీ 30 కిలో మీటర్లకు ఒక ట్రామా సెంటర్‌ను ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో డిగ్రీ కళాశాలు ఉన్నట్టు నర్సింగ్ కాలేజీలు సంఖ్యల పెంచే యోచనలో ఉన్నామని చెప్పారు. రాబోయే 15 రోజుల్లో ఉస్మానియా కొత్త ఆస్పత్రి నిర్మాణం కోసం శంకుస్థాపన చేయనున్నట్లు ప్రకటించారు.
'తెలంగాణ రాష్ట్రంలో మందుల కొరత లేదు' అని దామోదర రాజనర్సింహ ప్రకటించారు. మందుల కోసం ప్రతీ నెలా రూ.50 కోట్లు నిధులు ఇస్తున్నట్లు తెలిపారు. కేంద్ర పథకాలను రాష్ట్రంలో అమలు చేయడమే కాకుండా.. కొత్త చట్టాలను అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. 'తెలంగాణలో ఇన్‌పేషెంట్ పెరుగుతుంది. 7 వేల బెడ్స్ అవసరం ఉంది' అని చెప్పారు. వైద్య సదుపాయాల అభివృద్ధిపై తాము దృష్టి సారించామని.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైద్యారోగ్య శాఖ కొనసాగుతోందని ప్రకటించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.