AP Drone System: ఏపీ శాంతిభద్రతల్లో మరో పోలీస్‌ 'డ్రోన్‌'.. సీఎం చంద్రబాబు ఆదేశం

Chandrababu Orders To Usage Of Drone System: భ‌ద్ర‌తా చ‌ర్య‌లు.. నేర నియంత్ర‌ణ‌లో డ్రోన్ల వినియోగం పెంచాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. పోలీస్‌ వ్యవస్థతోపాటు ప్ర‌భుత్వ విభాగాల్లో డ్రోన్ల వినియోగం విస్తృతంగా వాడాలని సూచించారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Dec 3, 2024, 10:06 PM IST
AP Drone System: ఏపీ శాంతిభద్రతల్లో మరో పోలీస్‌ 'డ్రోన్‌'.. సీఎం చంద్రబాబు ఆదేశం

AP Drone System: శాంతి భద్రతల పరిరక్షణలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారు. ఈ క్రమంలోనే డ్రోన్ల వినియోగం పెంచాలని ఆదేశించారు. ఒక్క పోలీస్‌ వ్యవస్థలోనే కాకుండా ప్రభుత్వ విభాగాల్లో కూడా డ్రోన్ల వినియోగం పెంచాలని చెప్పారు. భ‌ద్ర‌తా చ‌ర్య‌లు, నేరాల నియంత్ర‌ణ‌కు డ్రోన్లను వినియోగించుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. అటవీ ప్రాంతాల్లో కూడా డ్రోన్లను వినియోగించాలన్నారు.

Also Read: YS Sharmila: కళ్లు తెరచిలోపే జగనన్న పోర్టులు అమ్మాడు.. మీరు ఏం చేస్తున్నారు?

 

అమరావతిలోని స‌చివాల‌యంలో మంగళవారం బెంగ‌ళూరుకు చెందిన ఓ ప్రైవేటు సంస్థ తాము రూపొందించిన మ‌ల్టీప‌ర్ప‌స్ డ్రోన్ల డెమోని సీఎం చంద్రబాబు ఎదుట ప్ర‌ద‌ర్శించింది. ఈ సందర్భంగా మల్టీపర్పస్‌ డ్రోన్‌ వినియోగం విశేషాలను కంపెనీ ప్రతినిధులు వివరించారు. 'ట్రాఫిక్ ర‌ద్దీ ఉన్న ప్రాంతాల్లో ఎన్ని వాహ‌నాలు ఉన్నాయి? అక్క‌డ తీసుకోవాల‌న్సిన చ‌ర్య‌లు ఏమిటి? భ‌ద్ర‌త‌కు సంబంధించి ఆయా మార్గాల్లో ఉన్న లోటుపాట్ల‌ను  ఈ డ్రోన్ల‌ను రియ‌ల్ టైమ్‌లో అంచ‌నావేసి చేర‌వేస్తాయి' అని ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ర‌ద్దీ ఉన్న ప్రాంతాల్లో ఈ డ్రోన్ల ద్వారానే పబ్లిక్ అనౌన్స్‌మెంటు కూడా చేసి ర‌ద్దీని నియంత్రించవ‌చ్చ‌ని కంపెనీ నిర్వాహకులు వెల్లడించారు.

Also Read: Pawan Kalyan: సముద్రంలో పవన్‌ కల్యాణ్‌ 'సీజ్‌ షిప్‌' వెనుక పెద్ద ప్లానే? నిజం తెలిసి టీడీపీ దిగ్భ్రాంతి

 

ఈ సంద‌ర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో డ్రోన్ల వినియోగం పెంచేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ర‌వాణా స‌దుపాయాలు లేని ప్రాంతాల్లో ప్ర‌జ‌ల‌కు డ్రోన్ల ద్వారా మందులు చేర‌వేయాల‌ని చెప్పారు. పంచాయ‌తీలు, మున్సిపాల్టీలో డ్రోన్ల వినియోగం పెంచి ఆ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం మెరుగ‌వ‌డానికి, దోమ‌ల నియంత్ర‌ణ‌కు మందుల పిచికారికి పెద్ద ఎత్తున ఉప‌యోగించుకునేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు.

అడ‌వుల్లో కార్చిచ్చు లాంటి ప్ర‌మాదాల‌ను డ్రోన్ల ద్వారా ప‌రిశీలించి చ‌ర్య‌లు తీసుకోవాలని అధికారులకు సీఎం చంద్రబాబు తెలిపారు. డ్రోన్ వినియోగంతో క‌లిగే ప్ర‌యోజ‌నాల‌పై ప్ర‌జ‌ల్లో కూడా అవ‌గాహ‌న పెంచాలని ఆదేశించారు. ప్ర‌భుత్వంలోని అన్ని శాఖ‌ల్లో డ్రోన్ల వినియోగం విస్తృత‌ప‌ర‌చాలని సూచించారు. ఈ కార్య‌క్ర‌మంలో పుర‌పాల‌క ‌శాఖ మంత్రి నారాయ‌ణ‌, మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంట‌ర్‌ప్రైజెస్ శాఖ మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీనివాస్‌, ముఖ్యమంత్రి కార్య‌ద‌ర్శి పీఎస్ ప్ర‌ద్యుమ్న‌, పెట్టుబ‌డులు మౌలిక‌ స‌దుపాయాల శాఖ కార్య‌ద‌ర్శి సురేశ్‌ కుమార్‌, ఏపీ డ్రోన్ కార్పొరేష‌న్ చైర్మ‌న్ అండ్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ దినేశ్ కుమార్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News