Hyundai car: కొత్త కారు కొనాలంటే ఇప్పుడే కొనేయండి...భారీగా పెరగనున్న హ్యుందాయ్ కార్ల ధరలు

Hyundai car Price Hike: కొత్త కారు కొనాలనుకుంటే వెంటనే కొనేయ్యండి. ఎందుకంటే వచ్చే ఏడాది నుంచి కార్ల ధరలు భారీగా పెరగనున్నాయి. ప్రముఖ కార్ల తయారు దారు సంస్థ అయిన హ్యుందాయ్ తన కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ ధరలు వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది. కాబట్టి కారు కొనాలనుకుంటే వెంటనే కొనేయడం మంచిది. 
 

1 /7

Hyundai car Price Hike:  కార్ల ధరలను పెంచబోతున్నట్లు హ్యుందాయ్ ఇండియా ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి తమ లైనప్ లోని అన్ని కార్లపై ధరలు పెంచుతున్నట్లు హ్యుందాయ్ మోటార్స్ ప్రకటించింది. ఈ కొరియన్ ఆటో దిగ్గజం క్రెట, వెన్యూ, ఎక్స్టర్, టక్సన్, అల్కాజర్ పాపులర్ మోడల్స్ తోపటు వెర్నా ఐ 20 , ఐ10, అయోనిక్ 5 తోపాటు ఇండియాలో అందుబాటులో ఉన్న అన్ని మోడల్స్ పై ధరలు పెంచనున్నట్లు ప్రకటించింది. 

2 /7

ఇన్ పుట్ మెటీరియల్ ఖర్చలు భారీగా పెరగడం, లాజిస్టిక్స్ ఖర్చు, ప్రతికూల మారకం రేట్ల కారణంతోనే వచ్చే నెల జనవరి నుంచి ధరల పెంపు అనివార్యం అయినట్లు హ్యుందాయ్ కంపెనీ తెలిపింది.   

3 /7

హ్యుందాయ్  మోటార్స్ తోపాటు పలు ఇతర కారు తయారీదారి సంస్థలు కూడా భారత్ లో కొత్త ఏడాది నుంచి ధరలు పెంచుతున్నట్లు ప్రకటించాయి. గతంలో లగ్జరీ కార్ల తయారీ దారు సంస్థలైన మెర్సిడెస్ బెంజ్, ఆడి, బీఎండబ్ల్యూ కూడా ఇవే తరహా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించాయి.   

4 /7

జనవరి 2025 నుంచి తమ లైనప్స్ లోని అన్ని కార్ల ధరలను పెంచుతున్నట్లు హ్యుందాయ్ కంపెనీ ప్రకటించింది. కానీ ఏ మోడల్ పై ఏ వేరియంట్ పై ఎంత ధర పెంచబోతుందో ఇంకా వెల్లడించలేదు. అయినప్పటికీ ఈ ధర పెంపు రూ. 25వేల వరకు ఉంటుందని కంపెనీ సీఈఓ తరుణ్ గార్గ్ హింట్ ఓ హింట్ ఇచ్చారు

5 /7

హ్యుందాయ్ మోటార్ డైరెక్టర్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ తరుణ్ గార్గ్ మాట్లాడారు. ఇన్పుట్ ఖర్చులు పెరుగుతుండటంతో ఈ వ్యయ పెరుగుదలలో కొంత భాగాన్ని చిన్న ధరల సర్దుబాటు ద్వారా బదిలీ చేయడం ఇప్పుడు ధరలు పెంచాల్సి వస్తుందన్నారు. ఈ ధరల పెంపు అన్ని మోడల్స్ లో జరుగుతుందన్నారు.   

6 /7

పెరుగుదల అనేది రూ. 25వేల వరకు ఉంటుందని ధరల పెంపు 2025 జనవరి 1 నుంచి అన్ని మోడల్స్ పై అమల్లోకి వస్తుందని తెలిపారు. హ్యుందాయ్ మోటార్స్ అమ్మకాల్లో ఇండియాలో రెండవ అతిపెద్ద కార్ల తయారీ దారు సంస్థ . భారత మార్కెట్లో ఉన్న అతి పురాతన విదేశీ బ్రాండ్లలో హ్యుందాయ్ కంపెనీ ఒకటి. హ్యుందాయ్ భారత్ లో తన చిన్న కార్లు, హ్యాచ్ బ్యాగ్స్ ద్వారా మంచి గుర్తింపు సాధించింది.   

7 /7

ఇప్పుడు ఈ సంస్థ ఎస్ యూవీలపై కూడా ఫోకస్ పెట్టింది. క్రెటా అత్యంత ప్రజాదరణ పొందిన ఎస్ యూవీ ల్లో ఒకటిగా నిలిచింది. అంతేకాదు భారత్ లో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఇది ఒకటి. నవంబర్ నెలలో హ్యుందాయ్ కంపెనీ మొత్తం 61,252 యూనిట్లను నమోదు చేసింది. గత ఏడాది నవంబర్ 65,801 యూనిట్లను విక్రయించగా..ఆ సంఖ్యతో పోల్చితే ఈ నవంబర్ లో అమ్మకాల సంఖ్య 6.9శాతం వరకు క్షీణించింది.