Gold Rate Today: దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. నవంబర్ నెలతో పోల్చితే డిసెంబర్ నెలలో భారీగా తగ్గుముఖం పట్టాయి. నేడు తులం బంగారం పై భారీగా తగ్గుదల నమోదు అయ్యింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధర ఏమేరకు తగ్గిందో తెలుసుకుందాం.
Gold Rate Today: మహిళలకు గుడ్ న్యూస్. బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. డిసెంబర్ 9వ తేదీ సోమవారం బంగారం ధర భారీగా తగ్గింది. పది గ్రాములకు దాదాపు 600రూపాయల మేర తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఇవాళ రూ. 77,649 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 71,179 రూపాయలు ఉంది. బంగారం ధరలు గత కొంత కాలంగా భారీగా పతనం అవుతున్నాయి. బంగారం ధరలు ఎందుకు తగ్గుతున్నాయి..దానికి గల కారణాలేంటో చూద్దాం.
బంగారం ధరలు డిసెంబర్ నెలలో దాదాపు భారీగా తగ్గాయి. డిసెంబర్ నెల ప్రారంభం నుంచి తగ్గుతూ వస్తున్నాయి. ముఖ్యంగా బంగారం ధర గత నెల నవంబర్ నెలలో ఆల్ టైం రికార్డు స్థాయి వరకు వెళ్లింది. దాదాపు 84వేల రూపాయలు క్రాస్ చేసింది. అప్పటి ధర తో పోల్చితే ఇప్పుడు దాదాపు 77వేల రూపాయలు వరకు తగ్గింది. అంటే ఒక నెలలో బంగారం ధర దాదాపు 7వేల రూపాయల వరకు తగ్గింది.
గోల్డ్ రేట్స్ తగ్గడానికి ప్రధానంగా అంతర్జాతీయ పరిణామాలే అని చెప్పవచ్చు. ఎందుకంటే అమెరికాలో డాలర్ బలపడే కొద్దీ బంగారం ధర పతనం అవుతుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
బంగారం ధరలు తగ్గడానికి ముఖ్య కారణం అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టనున్న నేపథ్యంలో అక్కడి స్టాక్ మార్కెట్లో బలంగా ట్రేడ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. దీంతో పెట్టుబడి దారులు తమ పెట్టుబడులను నెమ్మదిగా బంగారం వైపు నుంచి స్టాక్ మార్కెట్ల వైపు కదులుతున్నారు.
గతంలో గోల్డ్ పై ఇన్వెస్ట్ పెట్టేవారు రిస్క్ తక్కువగా ఉంటుందని పెట్టుబడి పెట్టేవారు. కానీ బంగారం కంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఎక్కువ రాబడి లభిస్తున్న నేపథ్యంలో అటు వైపు పెట్టుబడులను భారీగా తరలిస్తున్నారు.
బంగారం ధరలు తగ్గడానికి మర కారణం దేశీయంగా ప్రస్తుతం పండగల సీజన్ ముగియడంతోపాటు పెళ్లిళ్లు, వివాహాలు శుభకార్యాల సీజన్ కూడా తగ్గింది. అయితే పసిడి ధరలు ఫిబ్రవరి నెలలో మరింత తగ్గే అవకాశం ఉందని సమాచారం.