Humpback Whale journey: బజారుటో సెంటర్ ఫర్ సైంటిఫిక్ స్డడీస్ ఇటీవల తిమింగలంపై ఒక అధ్యయనం చేసింది. ఈ నేపథ్యంలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒక తిమింగలం ఆడతోడు కోసం మూడు సముద్రాలు ఈత కొట్టిందని విషయాన్ని వెల్లడించింది.
సాధారణంగా మనుషులు తమ జీవితంలో పెళ్లి చేసుకుంటారు. ఆడ తోడు, పిల్లలతో తమ ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్తుంటారు. అయితే.. చాలా మంది ఆడ తోడు కోసం పరితపిస్తుంటారు. ఇటీవల కాలంలో పెళ్లి జరగట్లేదని కూడా చాలా మంది తెగ రందీ పెట్టుకుంటున్నారంట. సరైన జీవిత భాగ స్వామి కోసం ఏమైన చేస్తున్నారంట.
ప్రస్తుతం మనిషేకాదు.. నోరులేని జీవాలు సైతం.. ఆడ తోడు కోసంపరితపిస్తుంటయంట. అదే విధంగా ఆడదాని కోసం మనుషులు కాదు.. జంతువులు సైతం యుద్దాలు చేస్తుంటాయని సూచించ అనేక ఘటనలు వార్తలలో నిలిచాయి
ఈ నేపథ్యంలో తాజాగా, ఒక ఘటన వార్తలలో నిలిచింది. ఇక్కడ ఒక తిమింగం ఏకంగా ఆడతోడు కోసం మూడు సముద్రాలను సైతం దాటిందంట. అది ఏకంగా 19 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించిదంట.ఈ మేరకు.. బజారుటో సెంటర్ ఫర్ సైంటిఫిక్ స్డడీస్ అధ్యయనం చేసింది.ఓ మగ తిమింగలం తగిన తోడు వెతుక్కొని పిల్లల్ని కనేందుకు ఏకంగా మూడు సముద్రాలు దాటి 19 వేల కిలోమీటర్లు ప్రయాణించిందని వెల్లడించింది.
తిమింగలం ప్రయాణాన్ని ఏఐ అల్గారిథం సాయంతో ఫొటో రికార్డింగ్ చేసి విశ్లేషించినట్లు తెలుస్తొంది. కొలంబియాలోని గల్ఫ్ ఆఫ్ ట్రిబుగా నుంచి ఈ తిమింగలం వలస ప్రయాణం ప్రారంభమై.. టాంజానియాలోని జాంజిబార్ తీరం వరకు జరిగిందని గుర్తించారు.
సాధారణంగా ఈ మగ తిమింగలాలు.. ఆడ తిమింగలంను ఆకర్శించేందుకు రకరకాల విన్యాసాలు చేస్తుంటాయి. అయితే.. ప్రస్తుతం ఈ తిమింగలం జర్నీ మాత్రం వార్తలలో నిలిచిందని చెప్పుకొవచ్చు. ఈ వార్త ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ గా మారింది. అయితే.. ఈ తిమింగలంకు తొందరలనే ఆడతోడు దొరకాలని కూడా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారంట.