Pushpa 2 World Wide Box office Collections: పుష్ప 2 మూవీతో అల్లు అర్జున్ చరిత్ర సృష్టించాడు. మన దేశంలోనే అత్యధిక బిజినెస్ చేసిన సినిమాగా ‘పుష్ప 2’ అనేక రికార్డులను బ్రేక్ చేసింది. మొత్తంగా థియేట్రికల్ గా.. నాన్ థియేట్రికల్ గా ఈ చిత్రం పలు రికార్డులకు పాతర వేసింది. తాజాగా 11వ రోజు కలెక్షన్స్ తో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా వాల్యూ బిజినెస్ ను బ్రేక్ చేసి లాభాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.
Pushpa 2 World Wide Box office Collections: ‘పుష్ప 2’ ముందు ఎవరెస్ట్ అంత టార్గెట్ నిన్నటితో పూర్తి చేసుకుంది. అది కూడా హిందీ ప్రేక్షకులు ఆదరించబట్టే ‘పుష్ప 2’ ఈ రేంజ్ లో దాదాపు రూ. 1300 కోట్లకు గ్రాస్ వసూళ్లను సాధించి ఔరా అనిపించింది. మొత్తంగా నిన్నటి కలెక్షన్స్ తో పుష్ప 2 చరిత్రలో పలు రికార్డులను తిరగరాసింది.
11వ రోజు కలెక్షన్స్ తో RRR లైఫ్ టైమ్ వసూళ్లైన రూ. 1290 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను క్రాస్ చేసింది. మరోవైపు కేజీఎఫ్ లైఫ్ టైమ్ వసూళ్లైన రూ. 1233 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను క్రాస్ చేసి రూ. 1500 కోట్ల వైపు పరుగులు పెడుతుంది. మొత్తంగా హిందీలో సెకండ్ వీకెండ్ లో ఆదివారం రూ. 54 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. సెకండ్ వీకెండ్ లో శని, ఆదివారాల్లోనే రూ. 128 కోట్ల నెట్ వసూల్లతో చరిత్రను తిరగరాసింది.
కేవలం హిందీ చిత్ర సీమలోనే ఈ పుష్ప 2 తన పట్టు బాగా నిలుపుకుంది. ముందుగా కర్ణాటకలో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న పుష్ప 2 మూవీ.. ఆ తర్వాత హిందీ + రెస్ట్ ఆఫ్ భారత్ లో తన టార్గెట్ కంప్లీట్ చేసుకుంది. అంతేకాదు ఓవర్సీస్ లో రూ. 100 కోట్ల టార్గెట్ ఆల్మొస్ట్ రీచ్ అయింది.
పుష్ప 2 పదొ రోజు రూ.100 కోట్ల గ్రాస్.. పదకొండో రోజు.. రూ. 100 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం రేపింది. మొత్తంగా దక్షిణాది నుంచి హిందీలో డబ్బైన చిత్రాల్లో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది.
నిన్నటితో కలిపి ‘పుష్ప 2’ హిందీ బాక్సాఫీస్ దగ్గర మన దేశంలో రూ. 561.50 కోట్ల నెట్ వసూల్లతో టాప్ లో ఉంది. సెకండ్ వీకెండ్ లో రూ. 100 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టిన తొలి చిత్రంగా రికార్డులు క్రియేట్ చేసింది.
ఈ రోజు, రేపటితో ఈ సినిమా హిందీలో కూడా ఇండస్ట్రీ హిట్ గా నిలిచే అవకాశాలున్నాయి. మొత్తంగా స్త్రీ 2 పేరిట ఉన్న రికార్డును స్మాష్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పట్లో పుష్ప 2 దూకుడును ఆపడం ఎవరి తరం కాదు. మరోవైపు తెలుగులో ఈ సినిమా వాల్యూ బిజినెస్ మీద రూ. 20 కోట్ల వరకు అందుకోవాల్సి ఉంది.
తమిళం, మలయాళంలో పుష్ప 2కు అనుకున్నంత మేర వసూళ్లను రాబట్టలేకపోయింది. మొత్తంగా రాబోయే రోజుల్లో పుష్ప 2 బాక్సాఫీస్ దగ్గర ఏ మేరకు సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.