Mohan Babu Vs Chiranjeevi: చిరంజీవి చేతిలో దారుణంగా మోసపోయిన మోహన్ బాబు.. తెర వెనక జరిగింది ఇదే..

Mohan Babu Vs Chiranjeevi: ప్రస్తుతం మోహన్ బాబు కుటుంబ ఇష్యూతో మరోసారి వార్తల్లో నిలిచింది. మంచు మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్.. తనకు ఆస్తిలో వాటా కోసం  తన తండ్రి అన్న పై తిరగబడ్డారు. ఆ సంగతి పక్కన పెడితే.. అప్పట్లో మోహన్ బాబు .. చిరంజీవి చేతిలో దారుణంగా మోసపోయిన మ్యాటర్ వైరల్ అవుతోంది.

1 /10

Mohan Babu Vs Chiranjeevi: తెలుగు సినీ ఇండస్ట్రీలో  మోహన్ బాబు, చిరంజీవికి ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది.  వీళ్లిద్దరు అప్పట్లో ఎన్నో చిత్రాల్లో కలిసి నటించారు. అందులో కొన్ని చిత్రాల్లో వీరిద్దరు కథానాయకులుగా నటించారు. కొన్ని చిత్రాల్లో చిరు నాయకుడిగా నటిస్తే.. మోహన్ బాబు ప్రతినాయకుడిగా యాక్ట్ చేసారు. అయితే ఓ సందర్భంలో చిరు చేతిలో  మోహన్ బాబు దారుణంగా మోసపోయిన ఘటన ప్రస్తుతం వైరల్ అవుతోంది.

2 /10

తెలుగు సినీ ఇండస్ట్రీలో మోహన్ బాబును చిరంజీవి మోసం చేయడం ఏమిటా అని ఆలోచిస్తున్నారా..వివరాల్లోకి వెళితే.. అప్పట్లో మోహన్ బాబు చేయాల్సిన ఓ చిత్రాన్ని చిరంజీవి గద్దలా తన్నుకుపోయరట.  

3 /10

అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి ఎస్పీ పరశురామ్, ది జెంటిల్మెన్, బిగ్ బాస్, రిక్షావోడు వంటి డిజాస్టర్ మూవీస్‌తో వరుసగా మూడేళ్లు డిజాస్టర్స్ తో కిందా మీదైయ్యాడు. అలాంటి టైమ్ లో చిరుకు లైఫ్‌ ఇచ్చిన చిత్రం హిట్లర్. ఈ సినిమాను ముందుగా నిర్మాతలు చిరంజీవితో చేయాలనుకోలేదు. మోహన్ బాబుతో తెరకెక్కించాలనుకున్నారు.  

4 /10

ఈ సినిమా ఆయన దగ్గరకు వెళ్లకుండానే ఈ సినిమాను చిరంజీవి చేసారు. అదే హిట్లర్ మూవీ. ముందుగా  ఎడిటర్ మోహన్ ముందుగా ఈ చిత్రాన్ని మోహన్ బాబు హీరోగా ఇవివి సత్యనారాయణ డైరెక్షన్ లో   రీమేక్ చేద్దామనుకున్నాడు. ఇదే విషయాన్ని రైటర్‌ మరుధూరి రాజాకు చెబితే.. ఆయన వెళ్లి ఇవివి ఈ కథను వినిపించారు.

5 /10

అయితే అప్పటికే మోహన్ బాబుతో అదిరింది అల్లుడు, వీడెవండీ బాబు సినిమాలకు కమిటై ఉన్నారు ఇవివి సత్యనారాయణ. మరోసారి మోహన్ బాబుతో సినిమా అనగానే సింపుల్‌గా కాదన్నారట. ఇవివి కారణంగా మోహన్ బాబు చేతి నుంచి హిట్లర్ మూవీ కథ చేజారింది.

6 /10

అదే టైమ్ లో ఈ సినిమాను చిరంజీవి రీమేక్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపెడుతున్నంటూ  మరుధూరి రాజాకు ఎడిటర్ మోహన్ ఫోన్ చేసి మరి చెప్పాడు. అప్పటి వరకు చిన్న సినిమాలకు రైటర్‌గా పనిచేస్తోన్నమరుధూరి.. చిరు సినిమా ఆఫర్ రావడంతో ఉప్పొంగి పోయాడట.

7 /10

అయితే దర్శకుడిగా ఇవివి బదులుగా ముత్యలా సుబ్బయ్య లైన్‌లోకి రావడంతో ఆయన రైటర్‌గా మరుధూరి రాజాకు బదులు ఎల్బీ శ్రీరామ్‌ను రచయతగా తీసుకున్నాడు. ఆయన ఇది అవమానంగా ఫీలై మరుధూరి రాజా వెళ్లిపోయాడు. కానీ ఎడిటర్ మోహన్ కోరిన మీదట ఓ వెర్షన్ రాసిచ్చాడట. 

8 /10

ఇక ముత్యాల సుబ్బయ్య.. రైటర్ ఎల్బీ శ్రీరామ్ సహకారంతో చిరంజీవికి హిట్లర్ మూవీతో పెద్ద సక్సెస్ అందించాడు. ఈ ఫ్లాష్ బ్యాక్ స్టోరీని రైటర్ మరుధూరి రాజా.. ఆ మధ్య ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. హిట్లర్ ముందు చిరంజీవి వరుస ఫ్లాపుల్లో ఉన్నాడు. 1995 డిసెంబర్‌లో చిరంజీవి .. రిక్షావోడు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.

9 /10

ఆ తర్వాత 1996లో చిరు నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు.అదే యేడాది 1996లో చిరు .. హిట్లర్ సినిమాను మొదలుపెట్టారు. ఈ సినిమా 1997 జవనరి 4న విడుదలై సంచలన విజయం సాధించి హీరోగా చిరంజీవికి మళ్లీ లైఫ్ ఇచ్చింది. ఈ రకంగా మోహన్ బాబుకు చేయాల్సిన సినిమాను చిరంజీవి దగ్గరకు వెళ్లింది.

10 /10

ఇందులో మోహన్ బాబును చిరు మోసం చేసింది ఏమి లేదు. ఏది ఏమైనా గింజ గింజ మీద తినేవారి పేరు రాసినట్టు.. సినీ ఇండస్ట్రీలో ఒకరి కోసం అనుకున్న సినిమా వేరేకరి దగ్గకు వెళ్లడం కామన్‌గా జరుగుతూ ఉంటాయి.అలా మోహన్ బాబు చేయాల్సిన హిట్లర మూవీ చిరంజీవి దగ్గరకు వెళ్లడం విశేషం. ఈ సినిమా మలయాళంలో ముమ్ముట్టి హీరోగా తెరకెక్కిన ‘హిట్లర్’ మూవీకి రీమేక్ గా తెరకెక్కడం విశేషం.