Allu Arjun Bail Cancelled: అల్లు అర్జున్ బెయిల్ రద్దు..?

Allu Arjun Bail Cancelled: అల్లు అర్జున్ బెయిల్ రద్దు కానుందా.. ? హై కోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ నిబంధనలను ఉల్లంఘించి ప్రెస్ బన్ని మీట్ పెట్టిన నేపథ్యంలో ఆయన బెయిల్ రద్దు చేయడానికి పోలీసులు పావులు కదుపుతున్నారా.. ? అంటే ఔననే అంటున్నాయి.

Written by - TA Kiran Kumar | Last Updated : Dec 23, 2024, 09:52 AM IST
Allu Arjun Bail Cancelled: అల్లు అర్జున్ బెయిల్ రద్దు..?

Allu Arjun Bail Cancelled: సినీ హీరో అల్లు అర్జున్ వివాదం అనూహ్య మలుపులు తిరుగుతోంది. సీఎం రేవంత్‌ రెడ్డి శాసనసభలో చేసిన కీలక వ్యాఖ్యల నేపథ్యంలో అల్లు అర్జున్ స్పందించి మీడియా సమావేశం నిర్వహించడం ఇపుడు వివాదం అవుతోంది. దీంతో పోలీసులు సైతం వీడియోల ద్వారా సంధయా టాకీస్ లో  ఏం జరిగిందో వివరించారు. అయితే  అల్లు అర్జున్  బెయిల్ నిబంధనలను ఉల్లంఘించారని.. ఆయన బెయిల్ రద్దు చేయాలంటూ మరికాసేట్లో హైకోర్టులో పిటీషన్ వేసేందుకు పోలీసులు నిర్ణయించారు.

అల్లు అర్జున్‌ విలేకరుల సమావేశం నిర్వహించడాన్ని హైదరాబాద్‌ నగర పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. బెయిల్‌ నిబంధనలను ఉల్లంఘించి దర్యాప్తును ప్రభావితం చేసేలా ఆయన వ్యాఖ్యలున్నాయని భావిస్తున్నారు. దీంతో, ఆయన బెయిలు ను రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్‌ వేయడానికి పోలీసులు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.

అల్లు అర్జున్‌కు వచ్చే నెల 21 వరకు మధ్యంతర బెయిల్‌ ఇచ్చింది. అంతేకాదు విచారణలో పోలీసులకు సహకరించాలని అర్జున్‌ను హైకోర్టు ఆదేశించింది. జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్న అర్జున్‌ హైకోర్టు ఆదేశాలతో రిలీజైనప్పటికీ కేసుకు సంబంధించిన విషయాలను బహిరంగంగా మాట్లాడకూడదని న్యాయ నిపుణులు గుర్తు చేస్తున్నారు. రేవతి మృతి విషయం ఎవరూ తనకు చెప్పలేదని, తన వ్యక్తిత్వ హననం జరుగుతోందని అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి తన ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే కదా. కేసు విచారణలో ఉన్న సమయంలో దానికి సంబంధించిన విషయాలపై అర్జున్‌ బహిరంగంగా మాట్లాడడం తప్పని పోలీసు అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే అర్జున్‌కు ఇచ్చిన మధ్యంతర బెయిలును రద్దు చేయాలంటూ చిక్కడపల్లి పోలీసులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసేందుకు రెడీ అవునట్లు తెలుస్తోంది. దీంతో, ఇప్పుడు పోలీసుల పిటీషన్.. కోర్టులో చోటు చేసుకునే పరిణామాల పైన ఆసక్తి కొనసాగుతోంది.

ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు..

ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News