బాలీవుడ్, హాలీవుడ్ లో రాణిస్తున్న ముంబై భామ ప్రియాంక చోప్రా. తాజాగా ఈ అమ్మడు ..బీచ్ లో షికారు చేస్తున్న ఫోటోలు వైరల్‌గా మారాయి. భర్త నిక్ జోనస్‌తో కలిసి ఆమె గుర్రపు స్వారీ చేసింది. ప్రియాంకా, నిక్ జోనాస్‌లు కలిసి చేతులు పట్టుకుని అందంగా హార్స్ రైడింగ్ చేశారు. ఈ ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో పంచుకుంది. దీనికి ఆమె అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది.
Read Also: కరోనా వీడియోపై సారీ చెప్పిన ఛార్మి
ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ లు నల్లరంగు దుస్తులు ధరించి.. నల్ల, తెల్ల గుర్రాలపై బీచ్ లో విహారం చేశారు. కొంతకాలం ప్రేమించుకున్న వారిద్దరూ 2018 డిసెంబర్ లో వివాహం చేసుకున్నారు.