K Kavitha Emotional Tribute To Indravelli Martyrs: జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజకీయంగా దూకుడు పెంచారు. ఈ క్రమంలోనే ఇంద్రివెల్ల అమరవీరుల స్థూపాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అమరులను తలచుకుని భావోద్వేగానికి లోనయ్యారు. ఆసిఫాబాద్ జిల్లాలో కవిత పర్యటనకు భారీ స్పందన లభించింది.
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పర్యటించారు.
ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపానికి కల్వకుంట్ల కవిత నివాళులర్పించారు. పూలు జల్లి.. కొబ్బరికాయ కొట్టారు.
ఆసిఫాబాద్‌లోని దేవునిగూడ గ్రామంలో ఆదివాసీ గోండు అక్కాచెల్లెళ్లతో కవిత కూర్చుని వారి కష్టనష్టాలు తెలుసుకున్నారు.
ఆదివాసీ బిడ్డను ప్రేమ, ఆప్యాయత, అభిమానానికి కవిత హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
కవిత పర్యటనలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కోవా లక్ష్మీ (ఆసిఫాబాద్), అనిల్ జాదవ్ (బోథ్) పాల్గొని విజయవంతం చేశారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల హక్కుల కోసం తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని ప్రకటించారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై కవిత తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు.
'కాంగ్రెస్ పాలనలో రైతులు, మహిళలతో పాటు అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతోంది. రైతు భరోసా కింద రూ.15 వేలు ఇస్తామని చెప్పి రూ.12 వేలకు తగ్గించి రేవంత్ రెడ్డి రైతులను మోసం చేశారు' అని కవిత మండిపడ్డారు.
'ప్రజా కోర్టులో కాంగ్రెస్ ప్రభుత్వానికి.. రేవంత్ రెడ్డికి శిక్ష తప్పదు' అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు.