దేశమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన తరుణం వచ్చేసింది. దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన నిర్భయ గ్యాంగ్ రేప్, హత్యకేసులో దోషులకు ఉరిశిక్ష అమలైంది. తిహార్ కేంద్ర కారాగారంలో నిందితులు ముఖేశ్ సింగ్(32), పవన్ గుప్తా(25), వినయ్ శర్మ(26), అక్షయ్ ఠాకూర్(31)లను మార్చి 20న (శుక్రవారం) ఉదయం 5.30 గంటలకు ఉరి తీశారు. తలారీ పవన్ కుమార్ జల్లాద్ నిర్భయ కేసు దోషుల ఉరితీత బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించారు. నిర్భయ దోషులను ఉరితీసినట్లు తిహార్ జైలు డీజీ సందీప్ గోయల్ తెలిపారు.
ఇస్మార్ట్ భామ అందాల ‘నిధి’ Bold photos
ఉరిశిక్ష అమలుకు కొన్ని గంటల ముందు సైతం ముగ్గురు దోషులు తప్పించుకోవడానికి తీవ్రంగా యత్నించినా ప్రయోజనం లేకపోయింది. తమ ఉరి నిర్ణయాన్ని వాయిదా వేయాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. గురువారం రాత్రి అత్యవసర విచారణ చేపట్టిన జస్టిస్ మన్మోహన్ నేతృత్వంలోని ధర్మాసనం వీరి పిటిషన్‌ను కొట్టివేసింది. ఉరిశిక్ష అమలు యథాతథంగా కొనసాగాలని పాటియాలా హౌస్ కోర్టు డెత్ వారెంట్ నిర్ణయానికే ధర్మాసనం మొగ్గుచూపింది.
డిసెంబర్ 16, 2012.. నిర్భయ ఘటన రోజు ఏం జరిగింది?
కాగా, డిసెంబరు 16, 2012లో ఢిల్లీలో కదులుతున్న బస్సులో 23ఏళ్ల వైద్య విద్యార్థినిపై ఆరుగురు వ్యక్తులు రామ్ సింగ్, ముఖేశ్ సింగ్, వినయ్ శర్మ, అక్షయ్ ఠాకూర్, పవన్ గుప్తా సహా ఓ మైనర్ సామూహిక అత్యాచారానికి పాల్పడటం దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. అత్యాచారాన్ని అడ్డుకునే యత్నం చేసిన నిర్బయ స్నేహితుడిని నిందితులు కొట్టారు. నిర్భయను సైతం చిత్ర హింసలకు గురిచేస్తూ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె మర్మాంగాలలో ఇనుపరాడ్లు జొప్పించడంతో తీవ్ర గాయాలతో పోరాడింది. సింగపూర్‌కు చికిత్స పొందుతూనే కన్నుమూసింది.
మా కూతురు తిరిగిరాదు.. ఆమె ఆత్మ శాంతిస్తుంది: నిర్బయ తల్లి
ఈ కేసులో ప్రధాన నిందితుడైన రామ్ సింగ్ తిహార్ జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకరు మైనర్ కావడంతో జువెనైల్ హోమ్‌కు తరలించగా మూడేళ్ల అనంతరం బయటకు వచ్చేశాడు. ఎన్నో వాయిదాలు, వాదనల తర్వాత నిర్భయపై అత్యాచారం కేసు విచారణ పూర్తయింది. వీరికి ఉరిశిక్ష విధించడం సరి అని ధర్మాసనం భావించింది. ఈ జనవరిలో పాటియాలా హౌస్ కోర్టు ముఖేశ్ సింగ్, వినయ్ శర్మ, పవన్ గుప్తా, అక్షయ్ ఠాకూర్లకు జనవరి 22న ఉరివేయాలని డెత్ వారెంట్ జారీ చేసింది. కానీ నిందితుల పిటిషన్లతో ఫిబ్రవరి 1కి ఓసారి, ఆపై మార్చి3వ తేదీకి మరోసారి వాయిదా, చివరగా మార్చి 20కి ఉరి వాయిదా వేశారు. ఎట్టకేలకు నేడు ఉరిశిక్ష అమలు చేశారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..