గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు

బులియన్ మార్కెట్‌లో శుక్రవారం బంగారం ధరలు భారీగా దిగొచ్చాయి. గతవారం తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఈ వారం మార్కెట్‌లో తగ్గుతూనే ఉన్నాయి.

Last Updated : Mar 20, 2020, 03:56 PM IST
గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు

బంగారం ప్రేమికులకు శుభవార్త. బులియన్ మార్కెట్‌లో శుక్రవారం బంగారం ధరలు భారీగా తగ్గాయి. గురువారం మార్కెట్‌లో ర్యాలీ అయిన బంగారం ధరలు నేడు తగ్గిపోయాయి. మార్చి 19న పెరిగిన బంగారం ధరలు మార్చి 20న క్షీణించాయి. జ్యువెలర్ల విక్రయాలు తగ్గుముఖం, దేశీయ మార్కెట్‌లో డిమాండ్ తగ్గడంతో పసిడి ధరలు నేటి మార్కెట్‌లో తగ్గాయి.

Pics: నాభి అందాలతో నటి రచ్చ రచ్చ!  

హైదరాబాద్ మార్కెట్‌లో మార్చి 20న (శుక్రవారం) బంగారం 10 గ్రాముల ధర రూ.1100 మేర దిగొచ్చింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.40,350కి క్షీణించింది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం ధర సైతం అంతే తగ్గింది. దీంతో 22 క్యారెట్ల బంగారం 10గ్రాముల ధర రూ.39,150 అయింది.

కరోనాను వాడేస్తున్న పులిహోర రాజాలు..!

దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లోనూ బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,100 మేర తగ్గింది. దీంతో 10 గ్రాముల ధర రూ.40,350కి చేరుకుంది. కాగా, 22 క్యారెట్ల బంగారం ధర సైతం అంతే తగ్గడంతో నలభై వేల కిందకి దిగొచ్చింది. 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.39,150కి చేరుకుంది. 

బంగారం దారిలోనే వెండి

బంగారం ధరలు తగ్గగా.. వెండి సైతం పసిడినే అనుసరించింది. వరుసగా రెండో రోజు వెండిధరలు తగ్గాయి. బులియన్ మార్కెట్‌లో 1 కేజీ వెండి ధర రూ.1,790 దిగొచ్చింది. దీంతో కేజీ వెండి ధర రూ. 39,990కు క్షీణించింది. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలోనూ ఒక కేజీ వెండి ధర రూ.39,990కి తగ్గింది.

బుల్లితెర భామ టాప్ Bikini Photos

ఏపీలోనూ తగ్గిన బంగారం ధరలు (24 Carat Gold Rate in Vijayawada and Visakhapatnam)
ఏపీలోనూ బంగారం ధరలు భారీగా తగ్గాయి. విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో బంగారం ధర రూ.1,050 మేర తగ్గింది. దీంతో ఈ నగరాలలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 41,920కి చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.38,340కి దిగొచ్చింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

ఇస్మార్ట్ భామ అందాల ‘నిధి’ Bold photos

Trending News