న్యూ ఢిల్లీ: కరోనాపై యుద్ధంలో భాగంగా ఏప్రిల్ 5, ఆదివారం నాడు రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు దేశంలో ఉన్న ప్రతీ ఒక్కరూ తమ ఇళ్లలో విద్యుత్ దీపాలు ఆపేసి కొవ్వొత్తులు, దీపాలు వెలిగించి కరోనాపై యుద్ధం చేస్తోన్న వీరులకు మద్దతు పలకాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా విమర్శించారు. జనం చేత చప్పట్లు కొట్టిస్తేనో.. లేక ఆకాశంలోకి లైట్లేస్తేనో వైరస్ పోదని ప్రధాని మోదీని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. భారత్ లో కోవిడ్ పరీక్షలు జరుగుతున్న తీరు సంతృప్తికరంగా లేదని.. కరోనా పరీక్షల్లో వేగం పెంచాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఇండియాలో ప్రతీ 10 లక్షల జనాభాకు కేవలం 29 మందికి మాత్రమే కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారన్న రాహుల్.. విదేశాల్లో జరుగుతున్న కోవిడ్ పరీక్షలతో పోల్చుకుంటే ఇది చాలా చాలా తక్కువ అని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు.
Read also : మళ్లీ దీపావళి వచ్చేసింది..!!
వివిధ దేశాల్లో ప్రతీ మిలియన్ జనాభాలో ఎంత మందికి కోవిడ్ పరీక్షలు జరుగుతున్నాయనే వివరాలను సూచించే ఓ ఇన్ఫోగ్రాఫిక్స్ ఫోటోను ట్విటర్ ద్వారా విడుదల చేసిన రాహుల్ గాంధీ.. అక్కడితో పోలిస్తే భారత్లో కోవిడ్ పరీక్షలు జరగాల్సిన స్థాయిలో జరగడం లేదని ఆరోపించారు.
India is simply not testing enough to fight the #Covid19 virus.
Making people clap & shining torches in the sky isn't going to solve the problem. pic.twitter.com/yMlYbiixxW
— Rahul Gandhi (@RahulGandhi) April 4, 2020
ఇదిలావుంటే, కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం ఆదివారం ఉదయం వరకు భారత్లో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 3,072 కు చేరగా అందులో 2784 మంది ప్రస్తుతం ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. 212 మందికి వ్యాధి పూర్తిగా నయమై డిశ్చార్జ్ అవగా 75 మంది మృతిచెందారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..