దేశవ్యాప్తంగా CBSE స్కూలు విద్యార్థులు ఎదురు చూస్తున్న పరీక్షల తేదీలు వచ్చేశాయి. సీబీఎస్ఈ పదో తరగతి, 12వ తరగతి పెండింగ్ పరీక్షల తేదీలను కేంద్ర మానవవనరుల మంత్రిత్వ శాఖ విడుదల చేసింది.
కొత్త షెడ్యూల్ ప్రకారం జులై 1 నుంచి జులై 15 వరకు వివిధ పరీక్షలు నిర్వహిస్తామని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ తెలిపారు. ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్ అంటూ ట్విట్టర్ ద్వారా నోటిఫికేషన్ విడుదల చేశారు.
అప్పట్లో ఈశాన్య ఢిల్లీలో పౌరసత్వ సవరణ బిల్లు కారణంగా హింసాత్మక ఘటనలు చెలరేగాయి. దీంతో CBSE 12వ తరగతి పరీక్షల నిర్వహణకు ఇబ్బంది ఏర్పడింది. తాజాగా ఆ పరీక్షలకు కూడా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో భాగంగా జులై 1న హోం సైన్స్ పరీక్ష జరగనుంది. ఆ తర్వాత జులై 9న బిజినెస్ స్టడీస్ పరీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత జులై 10న బయోటెక్నాలజీ పరీక్ష ఉంటుంది. జాగ్రఫీ పేపర్ జులై 11న ఉంటుంది. అలాగే ఫిజిక్స్ పేపర్ జులై 3న, అకౌంటెన్సీ పేపర్ జులై 4న, కెమెస్ట్రీ పేపర్ జులై 6న నిర్వహించనున్నారు.
మరోవైపు కరోనా వైరస్ కారణంగా నిలిచిపోయిన CBSE పదో తరగతి పరీక్షలకు కూడా షెడ్యూల్ విడుదలైంది. జులై 1న సోషల్ సైన్స్ తో పరీక్షలు మొదలవుతాయి. చివరి పేపర్ ఇంగ్లీష్ వరకు తేదీలను ప్రకటించారు. అలాగే జులై 10 హిందీ, జులై 15న ఇంగ్లీష్ పేపర్ నిర్వహించనున్నారు. పూర్తి షెడ్యూల్ కోసం ఈ క్రింద ట్వీట్ చూడండి.
Dear students of class 12th of #CBSE Board here is the date sheet for your board exams.
All the best 👍#StaySafe #StudyWell@HRDMinistry @mygovindia@cbseindia29 @PIB_India @MIB_India @DDNewslive pic.twitter.com/2ug6Dw8ugA
— Dr Ramesh Pokhriyal Nishank (@DrRPNishank) May 18, 2020
జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..