India: ఒక్కరోజులో రికార్డు కరోనా కేసులు

India CoronaVirus Cases | భారత్‌లో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. దేశ వ్యాప్తంగా నిత్యం భారీగా పాజిటివ్ కేసుల నమోదుతో పాటు కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. అయితే చికిత్స అనంతరం ఇప్పటివరకూ 6,12,815 మంది కోలుకుని డిశ్ఛార్జ్ అయ్యారు.

Last Updated : Jul 16, 2020, 11:04 AM IST
India: ఒక్కరోజులో రికార్డు కరోనా కేసులు

భారత్‌లో కరోనా వైరస్ (India CoronaVirus Cases) మహమ్మారి పంజా విసురుతోంది. నిత్యం భారీగా పాజిటివ్ కేసులతో పాటు కోవిడ్19 మరణాలు సైతం భారీగా పెరిగిపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 32,695 కరోనా పాజిటివ్ కేసులను నిర్ధారించారు. ఒకరోజు నమోదైన కేసులలో ఇదే అత్యధికం. గతంలో 30వేలకు పైగా కేసులు ఏ ఒక్కరోజు నమోదు కాలేదు. తాజా కేసులతో కలిపితే భారత్‌లో మొత్తం కరోనా కేసుల సంఖ్య (CoronaVirus Cases In India) 9,68,876కు చేరింది. Corosure: అత్యంత చవకైన కరోనా టెస్ట్ కిట్‌ 

అదే సమయంలో 606 మంది ప్రాణాంతక కరోనా మహమ్మారితో పోరాడుతూ మరణించారు. భారత్‌లో కోవిడ్19 మరణాల సంఖ్య 24,915కు చేరుకుంది. మొత్తం కేసులకుగానూ చికిత్స అనంతరం ఇప్పటివరకూ 6,12,815 మంది డిశ్ఛార్జ్ అయ్యారు. ప్రస్తుతం 3,31,146 యాక్టివ్ కేసులున్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ మేరకు గురువారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. 

రెట్టింపవుతున్న కేసులు
భారత్‌లో ప్రస్తుతం రికవరీ రేటు 63.24శాతంగా ఉంది. కరోనా కేసులు, మరణాలు నెలరోజుల వ్యవధిలో రెట్టింపు అవుతున్నట్లు కనిపిస్తోంది. జూన్ నెలలలో దాదాపు 4 లక్షల కరోనా కేసులు రాగా, జులైలో సగం రోజుల్లోనే 3,80,000 కోవిడ్19 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర 2,75,640 పాజిటివ్ కేసులు, 10,928 మరణాలతో కరోనా తీవ్రతను అధికంగా ఎదుర్కొంటోంది. ఢిల్లీలో 3,487 మంది, తమిళనాడులో 2,167 మంది, గుజరాత్‌లో 2079 మంది కరోనా సోకడంతో మరణించారు. RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos
జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..

Trending News