కరోనా వైరస్ మహమ్మారి ( Corona virus pandemic ) ప్రారంభమైనప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని పొట్టన పెట్టుకుంది. మందు లేదా వ్యాక్సిన్ కనుగొనేందుకు అన్ని ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. ఈ నేపధ్యంలో అందరికీ తెలిసిన ఈ చిన్న చిట్కానే వైరస్ ను అంతం చేస్తుందని రష్యా సైంటిస్టులు ( Russian Scientists ) చెబుతున్న మాటలు ఆలోచింపజేస్తున్నాయి.
ఆయుర్వేదం కావచ్చు..మరొకటి కావచ్చు లేదా ఒక్కోసారి చిన్నచిన్న చిట్కా వైద్యాలే పెద్ద పెద్ద వ్యాధుల్ని దూరం చేస్తుంటాయి. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ( Corona virus ) కు రష్యా సైంటిస్టులు చెబుతున్నఉపాయమేంటో వింటే అందరికీ ఆశ్చర్యం కలుగుతుంది. కారణం ఇది అందరికీ తెలిసిందే. అయితే దీన్ని రష్యా సైంటిస్టులు శాస్త్రీయంగా నిరూపించారు. అధ్యయనం చేసి చూపించారు. అదే గోరు వెచ్చని నీటి ఫార్ములా.
కరోనా వైరస్ పై అధ్యయనం చేస్తున్న రష్యాకు చెందిన సైబీరియాలోని నోవోసిబిర్స్క్ స్టేట్ యూనివర్సిటీలోని రీసెర్చ్ సెంటర్ ఆఫ్ వైరాలజీ అండ్ బయోటెక్నాలజీ ఈ విషయాన్ని కనుగొంది. ఈ ఇనిస్టిట్యూట్ కు చెందిన పరిశోధనా బృందం సాధారణ గది ఉష్ణోగ్రత లేదా గోరువెచ్చని నీరు ( Warm water ) తాగితే కరోనా వైరస్ నాశనం అవుతోందని తేల్చారు. గది ఉష్ణోగ్రత కలిగిన నీరు కరోనాకు కారణమవుతున్న సార్స్ సీఓవి-2 ( Sars cov-2 ) వైరస్ పెరుగుదలను ఆపుతుందని గుర్తించారు ఈ సైంటిస్టులు. రూమ్ టెంపరేచర్ కలిగిన నీరు 24 గంటల వ్యవధిలో కరోనా వైరస్ కణాల్ని 90 శాతం చంపేస్తుందని..72 గంటల్లో అయితే 99.9 శాతం సెల్స్ ను నాశనం చేస్తుందని తేల్చారు. అదే మరుగుతున్న నీటిలో అయితే పూర్తిగా వైరస్ ను చంపేయగలదని గుర్తించారు. మరోవైపు క్లోరినేటెడ్ నీరు, సముద్రపు నీటిలో అంటే ఉప్పు నీటిలో వైరస్ జీవించగలుగుతున్నా...సంతతిని మాత్రం పెంచుకోలేకపోతోందని గుర్తించారు. ఓవరాల్ గా కరోనా వైరస్ జీవితకాలమనేది నీటి ఉష్ణోగ్రతపై ఆధారపడి ఉంటుందనే విషయాన్ని పరిశోధకులు నిర్ధారించారు. Also read: Covid-19 Remedies: ఆవిరి చికిత్సతో కరోనావైరస్ ఖేల్ ఖతం... రీసెర్చ్ వెల్లడి