హిందీ టీవీ నటుడు సమీర్ శర్మ గత రాత్రి ముంబైలోని అతడి ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం ( TV Actor Sameer Sharma's death ) కలకలం సృష్టించింది. సమీర్ శర్మ తన ఇంట్లోనే వంట గదిలో ఉరేసుకుని చనిపోయాడు. ఘటనాస్థలిని పరిశీలించిన ముంబై పోలీసులు.. సమీర్ శర్మ తనకు తానే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు. సమీర్ శర్మ మృతదేహాన్ని గమనించిన అపార్ట్మెంట్ సెక్యురిటీ గార్డు మిగతా అపార్ట్మెంట్ వాసులకు సమాచారం అందించడంతో సమీర్ శర్మ ఆత్మహత్య ఉదంతం వెలుగులోకి వచ్చింది. బాలాజీ టెలిఫిలింస్ నిర్మించిన క్యూంకీ సాస్ బి కబీ బహూ థీ ( Kyunki Saas Bhi Kabhi Bahu Thi ), కహానీ ఘర్ ఘర్ కీ ( Kahaani Ghar Ghar Ki ) వంటి ఫేమస్ సీరియల్స్‌లో సమీర్ నటించాడు. Also read: నితిన్ సినిమాను పూజా హెగ్డే అందుకే రిజెక్ట్ చేసిందా ?
సమీర్ శర్మ మృతిపై కేసు నమోదు చేసుకున్న ముంబై పోలీసులు.. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. అతడు హత్యకు గురైనట్టు ఎలాంటి ఆధారాలు లభించలేదని.. అదే సమయంలో ఇంట్లో ఎలాంటి సూసైడ్ నోట్ కూడా లభించలేదని ముంబై పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు పంపించామని.. పోస్టుమార్టం నివేదిక వస్తే కానీ మరిన్ని విషయాలు తెలిసే అవకాశం లేదని పోలీసులు వెల్లడించారు. Also read: ‘సుశాంత్‌ను సెలబ్రిటీ చేసింది ముంబై.. బిహార్ జోక్యమెందుకు’
దిల్ క్యా చాహతా హై, గీత్-హుయీ సబ్ సే పరాయి, లెఫ్ట్ రైట్ లెఫ్ట్ వంటి టీవీ షోలతో పాటు 2009లో వచ్చిన బాలీవుడ్ మూవీ ' హసీ తో ఫసీ ' సినిమాలోనూ సమీర్ శర్మ నటించారు. Also read: Aarthi Agarwal biopic: ఆర్తి అగర్వాల్‌పై బయోపిక్
బాలీవుడ్ నటీనటులు, హిందీ టీవీ పరిశ్రమకు చెందిన నటీనటులు తరచుగా ఆత్మహత్యలకు పాల్పడుతున్న తీరు వారు ఎదుర్కొంటున్న ఒత్తిళ్లు ఏ స్థాయిలో ఉన్నాయనేది చెప్పకనే చెబుతోంది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటీవల సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి ( Sushant Singh Rajput's death ) ఎంత సంచలనం రేపిందో అందరికీ తెలిసిందే. Also read: Prabhas Next Movie: ప్రభాస్ మరో ప్యాన్ ఇండియా సినిమా ?