హీరో సుమంత్ చిత్రం.. 'మళ్ళీ రావా' పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సుమంత్ బాడీ లాంగ్వేజ్ కు చక్కగా సూట్ అయ్యే సినిమా అంటూ పలువురు ప్రసంశించారు. 'మళ్ళీ రావా' మూవీపై ఇప్పటికే అక్కినేని నాగార్జున, అక్కినేని నాగ చైతన్య తో పాటు పలువురు టాలీవూడ్ హీరోలు కాంప్లిమెంట్స్ ఇచ్చారు.
తాజాగా ఈ సినిమా పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆసక్తిని కనబరిచారట. తనకు వెంటనే 'మళ్ళీ రావా' సినిమా చూడాలనిపిస్తోందని అన్నారట. ఈ విషయాన్ని హీరో సుమంత్ ఆయన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. 'నాకు ఇప్పడే గౌరవనీయులైన ముఖ్యమంత్రివర్యులు సీఎం కేసీఆర్ నివాసం వద్ద నుండి ఒక మెసేజ్ వచ్చింది. 'మళ్ళీ రావా' సినిమా చూడటానికి ఒక ప్రింట్ పంపగలుగుతారా?' అని అడిగారని ట్వీట్ చేశారు.
Just got a msg from honorable CM KCR garu's residence, requesting for a print to be sent for viewing. Sending it with pleasure and gratitude 🙏🏼
— Sumanth (@iSumanth) December 8, 2017