న్యూఢిల్లీలోని సశస్త్ర సీమాబల్ (Sashastra Seema Bal) కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1,522 పోస్టులను భర్తీ చేస్తున్నారు. తగిన అర్హతలు, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా SSB Jobs 2020కు దరఖాస్తు చేసుకోవాలి. డిపార్ట్మెంట్లో పలు రకాల పోస్టులున్నాయి.
SSB constable recruitment 2020 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడులైన రోజు నుంచి 30 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి. నోటిఫికేషన్ జులై 28న విడుదలైంది. దరఖాస్తు ఫీజు రూ.100 చెల్లించాలి. అయితే ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు.
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. జీతం లెవల్ 3 పే ప్రకారం.. రూ.21,700 నుంచి రూ.69,100 వరకు ఉంటుంది.
నోటిఫికేషన్ (SSB Constable jobs 2020 Notification)
వెబ్సైట్ (Sashastra Seema Bal Website)
కానిస్టేబుల్ పోస్టులు: 1522, విభాగాలవారీగా ఖాళీలు..
- డ్రైవర్): 574
- కుక్ – మెన్: 232
- వెటర్నరీ: 161
- వాటర్ క్యారియర్-మెన్: 101
- వాషర్‌మ్యాన్- మెన్: 92
- సఫాయ్ వాలా- మెన్: 89
- బార్బర్- మెన్: 75
- సఫాయ్ వాలా-ఉమెన్: 28
- వాషర్‌మ్యాన్- ఉమెన్: 28
- కుక్- ఉమెన్: 26
- ల్యాబొరేటరి అసిస్టెంట్: 24
- టైలర్: 20
- కాబ్లర్: 20
- బార్బర్- ఉమెన్: 12
- వాటర్ క్యారియర్-ఉమెన్: 12
- పెయింటర్: 12
- గార్డెనర్: 09
- ఆయా-మహిళలు మాత్రమే: 05
- కార్పెంటర్: 03
- వెయిటర్- మెన్: 01
- ప్లంబర్: 01