లక్నో: సాంకేతిక పరిజ్ఞానం, బ్యాంకుల మధ్య పోటీపూరిత వాతావరణం పెరగడంతో ప్రస్తుతం కూర్చున్న చోటుకే అన్ని సేవలు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. గతంలో బ్యాంకుకి వెళ్తే కానీ డబ్బులు విత్ డ్రా ( Money withdrawals ) చేసుకునే వీలు ఉండేది కాదు. ఏటీఎంలు ( ATMs ) వచ్చాకా డబ్బుల కోసం బ్యాంకుల వరకు వెళ్లే బాధ తప్పింది. మీకు దగ్గర్లో ఉన్న ఏ ఏటీఎంకు వెళ్లినా మీ బ్యాంక్ ఎకౌంట్ ( Bank account ) నుండి డబ్బు డ్రా చేసుకునే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. తాజాగా SBI అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ కొత్త సేవలతో ఇక మీరు ఏటిఎం వరకు కూడా వెళ్లాల్సిన అవసరం కూడా లేకుండానే డబ్బు డ్రా చేసుకునే వీలు ఉంది. ఏంటి నమ్మలేకపోతున్నారా ? కానీ ఇదే నిజం. Also read : Rhea Chakraborty: వైరల్‌గా మారిన రియా చక్రవర్తి,మహేష్ భట్ మధ్య వాట్సాప్ చాటింగ్
ఎస్బీఐ కస్టమర్లకు ( SBI customers ) ఇకపై ఏటీఎం సేవలు అవసరం అయితే, ఏటీఎం సెంటర్స్ వరకు వెళ్లాల్సిన పని లేదు. ఎస్బీఐకి కాల్ చేసినా... లేదంటే వాట్సాప్ ( Whatsapp message ) ద్వారా మెసేజ్ చేసినా.. SBI Mobile ATM మీ ఇంటి ముందుకే వస్తుంది. కాకపోతే ప్రస్తుతానికి పైలట్ ప్రాజెక్టు కింద ఈ సేవలను లక్నో వరకు మాత్రమే పరిమితం చేశామని.. పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే మిగతా నగరాలకు కూడా ఈ డోర్ డెలివరీ సేవలు విస్తరింపజేస్తామని లక్నో సర్కిల్ ఎస్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ అజయ్ కుమార్ ఖన్నా తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. Also read : Surekha Vani: కనిపించిన ప్రతీ మగాడితో అఫైర్స్ అంటగడుతున్నారని నటి ఆవేదన
This Independence Day @TheOfficialSBI for the Lucknowites has introduced the facility of Mobile ATM at their doorstep. Just dial or WhatsApp to let us know and we will do the rest.#SafeBanking
Proud partners with @radiocityindia pic.twitter.com/puQgjIfjXr
— Ajay Kumar Khanna (@AjayKhannaSBI) August 17, 2020
05.01.2018 నుంచే ఎస్బీఐ అనేక డోర్‌స్టెప్ సర్వీసెస్ అందుబాటులోకి తీసుకొచ్చిందని.. పలు ఎంపిక చేసిన బ్రాంచుల పరిధిలో ఈ కింది డోర్‌స్టెప్ సర్వీసెస్ అందుబాటులో ఉన్నాయని ఎస్బీఐ వెల్లడించింది.
Cash pickup: క్యాష్ పికప్
Cash delivery: క్యాష్ డెలివరి
Cheque pickup: చెక్ పికప్
Cheque requisition Slip pickup: చెక్ రిక్విజిషన్ స్లిప్ పికప్
Form 15H pickup: 15హెచ్ ఫారం పికప్
Delivery of Drafts: డ్రాఫ్ట్స్ డెలివరి
Delivery of Term Deposit Advice: టర్మి డిపాజిట్ అడ్వైజ్
Life Certificate Pickup: లైఫ్ సర్టిఫికెట్ పికప్
KYC documents pickup: కేవైసి డాక్యుమెంట్స్ పికప్