/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

అన్ లాక్ ప్రక్రియ ( Unlock process ) కొనసాగుతున్నా సరే..ఇంకా కొన్ని రాష్ట్రాల్లో ఆంక్షలు నడుస్తున్నాయి. ఓ రాష్ట్రం నుంచి మరో రాష్ట్రంలో ప్రవేశించాలంటే ఎంట్రీ పాస్ ( Entry pass ) లు కావల్సిందే. కేంద్ర హోంశాఖ దీనికి నో చెప్పింది. కొనసాగితే మాత్రం ఉల్లంఘనేనని హెచ్చరించింది.

మీరు ఆంధ్ర ప్రదేశ్ ( Andhra pradesh ) గానీ...తమిళనాడు ( Tamil nadu ) గానీ..మరో రాష్ట్రం గానీ వెళ్లాలనుకుంటున్నారా...మరి ఈ పాస్ ఉందా.. లేకపోతే వెనక్కి పంపించేస్తారు. ఇదీ నిన్నటివరకూ ఉన్న ఆంక్షలు, హెచ్చరికలు. ఇప్పుడు దీనిపైనే కేంద్ర హోంశాఖ ( Central home ministry ) స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. ఇకపై వస్తువులు, వ్యక్తుల రవాణాపై ఎటువంటి ఆంక్షలు ఉండకూడదని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా ( Central home secretary Ajay bhalla ) ఆదేశాలు జారీ చేశారు. ఆంక్షలు, ఎంట్రీ పాస్ ( Restrictions & Entry passes ) ల వల్ల ఆర్ధిక వ్యవహారాలు, ఉపాదిపై ప్రభావం పడుతోందని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. మరోవైపు అన్ లాక్ 3 లో ( Unlock 3 ) భాగంగా..కేంద్ర హోంశాఖ జూలై 27న ఇచ్చిన గైడ్ లైన్స్ కు ఎంట్రీ పాస్ ల విధానం విరుద్ధమని తెలిపారు. ఆ గైడ్ లైన్స్ లోన పేరా 5 ప్రకారం...అంతర్రాష్ట్ర్ రవాణాపై స్పష్టమైన విధివిధానాలున్నాయి. ఓ రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ప్రజలైనా , వాహనాలైనా వెళ్లాలంటే ఎలాంటి ప్రత్యేక అనుమతులు అవసరం లేదు. ఎలాంటి ఆంక్షలు  విధించకూడదు. ప్రత్యేక అనుమతులు, ఈ పాస్ లు ( No special permissions, no E passes ) ఉండకూడదు. 

అయితే ఈ నిబంధనల్ని పట్టించుకోకుండా కొన్ని రాష్ట్రాలు , జిల్లాల్లో ఆంక్షలు విధిస్తున్నట్టు కేంద్రం దృష్టికి వెళ్లింది. దీంతో కేంద్ర హోంశాఖ ఈ ఆదేశాలు జారీ చేసింది. ఇటువంటి షరతులు గానీ ఆంక్షలు గానీ విధించడమంటే...కేంద్రం జారీ చేసిన నిబంధనల్ని ఉల్లంఘించినట్టేనని హోంశాఖ స్పష్టం చేసింది. Also read: Singer Balu Health: అది జరగకపోయుంటే...బాలు ఆరోగ్యంగా ఉండేవారా

Section: 
English Title: 
No Entry passes need to entry in states, says central home ministry
News Source: 
Home Title: 

Covid19 pass: ఇకపై రాష్ట్రాల్లో ఎంట్రీ పాస్ లు వద్దు..కేంద్రం ప్రకటన

Covid19 pass: ఇకపై రాష్ట్రాల్లో ఎంట్రీ పాస్ లు వద్దు..కేంద్రం  ప్రకటన
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Covid19 pass: ఇకపై రాష్ట్రాల్లో ఎంట్రీ పాస్ లు వద్దు..కేంద్రం ప్రకటన
Publish Later: 
No
Publish At: 
Saturday, August 22, 2020 - 17:49
Created By: 
Md. Abdul Rehaman
Updated By: 
Md. Abdul Rehaman
Published By: 
Md. Abdul Rehaman