కరోనా వైరస్ వస్తుంది..పోతుంది కూడా. అత్యధిక శాతం హోమ్ క్వారెంటైన్ ( Home Quarantine ) తోనే నయం చేసుకుంటున్న పరిస్థితి. ఆరోగ్యపరంగా ఇతర సమస్యలు లేకపోతే చాలు. మరి సింగర్ బాలు ( Singer Balu ) కు ఎందుకు సీరియస్ అయింది..కారణం అదేనా.
వాస్తవానికి స్థూలకాయం తప్ప..బాలసుబ్రహ్మణ్యం ( Bala Subrahmanyam ) ఎప్పుడూ ఆరోగ్యంగా..యాక్టివ్ గానే ఉండేవారు. హుషారుగా మాట్లాడేవారు. ఇతర వ్యాధులు ఉన్నట్టు కూడా పెద్దగా సమచారం లేదు. ఎప్పుడూ వినలేదు కూడా. మరిప్పుడు కరోనా వైరస్ ( Corona virus ) సోకి పరిస్థితి విషమమైంది. ప్రాణాలతో పోరాడుతున్నారు. చెన్నైలోని ఎంజిఎం ఆస్పత్రి ( Chennai MGM Hospital ) లో కొన్నిరోజుల్నించి వెంటిలేటర్ పైనే ఉన్నారు. వయస్సు పైబడడమే కారణమని చాలామంది భావిస్తున్నా...వాస్తవం అది కాదు. అసలు కారణం గత యేడాది జరిగింది.
స్థూలకాయం నుంచి విముక్తి పొందడానికి గత యేడాది ఆయన బేరియాట్రిక్ సర్జరీ( Bariatric Surgery ) చేయించుకున్నారు. వైద్యశాస్త్రం ప్రకారం ఇది చాలా కాంప్లికేటెడ్ సర్జరీనే ( Complicated surgery ). సర్జరీ అనంతరం చాలా జాగ్రత్తగా ఉండాల్సివస్తుంది. అన్నింటికీ సిద్ధమయ్యే ఈ సర్జరీ చేయించుకోవాలి. బాలసుబ్రహ్మణ్యం కూడా అలాగే గత యేడాది ఈ సర్జరీ చేయించుకున్నాక...చాలవరకూ బరువు తగ్గిపోయారు. ముందుగా అనుకున్నట్టుగానే జాగ్రత్తగానే ఉన్నారు. కానీ ఊహించని ఉపద్రవం కరోనా రూపంలో వచ్చిపడింది. బేరియాట్రిక్ సర్జరీ కారణంగా కొద్దిగా బలహీనపడిన శరీర అవయవాలపై కరోనా వైరస్ ( Corona virus ) తీవ్ర ప్రభావాన్ని చూపడంతో పరిస్థితి విషమించిందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. Also read: Chiranjivi Birthday: సత్యదేవ్ విషెస్ చూస్తే హ్యాట్సాఫ్ అనక తప్పదు