Singer Karunya: టాలీవుడ్ సింగర్ కారుణ్య ఇంట విషాదం

ఇండియన్ ఐడల్ రన్నరప్, ఫేమస్ సింగర్ కారుణ్య ఇంట విషాదం చోటుచేసుకుంది. కారుణ్య తల్లి జానకి కన్నుమూశారు (Karunya Mother Passed Away). గత కొంతకాలం నుంచి క్యాన్సర్‌తో పోరాడుతున్న జానకి శనివారం తుదిశ్వాస విడిచారు.

Last Updated : Aug 30, 2020, 09:21 AM IST
Singer Karunya: టాలీవుడ్ సింగర్ కారుణ్య ఇంట విషాదం

టాలీవుడ్ ఫేమస్ సింగర్, ఇండియన్‌ ఐడల్‌ రన్నరప్‌ కారుణ్య (Singer Karunya) ఇంట విషాదం నెలకొంది. ఆయన తల్లి జానకి(70) అనారోగ్యంతో కన్నుమూశారు (Karunya Mother Passed Away). గత కొంతకాలం నుంచి క్యాన్సర్ మహమ్మారితో పోరాడుతున్న జానకి శనివారం తుదిశ్వాస విడిచారు (Karunya Mother Dies With Cancer). బాలాపూర్ మండలం మీర్‌పేట కార్పోరేషన్‌ త్రివేణినగర్‌లో కారుణ్య తల్లి జానకి, తండ్రి మధు నివాసం ఉంటున్నారు. 

కారుణ్య తల్లి జానకి కేంద్ర రక్షణ రంగ సంస్థ బీడీఎల్‌లో పనిచేసి రిటైర్ కాగా, తండ్రి మధు సైతం డిఫెన్స్ రంగంలోనే సేవలందించి పదవీ విరమణ పొందారు. జానకి అంత్యక్రియలను సైదాబాద్‌ శ్మశాన వాటికలో నిర్వహించారు. టాలీవుడ్ ప్రముఖులు, పలువురు సింగర్స్ కారుణ్యను ఫోన్ ద్వారా పరామర్శించారు. కరోనా నిబంధనల నేపథ్యంలో పరిమిత సంఖ్యలో బంధువులు, సన్నిహితులు అంత్యక్రియలకు హాజరయ్యారు.

Trending News