Couple garlanded with shoes: ప్రేమ జంటకు చెప్పుల దండ

ప్రేమించుకున్న పాపానికి ఓ ప్రేమ జంటను ( Couple in love ) హింసించి, వారి ముఖాలపై నల్ల రంగు పులిమి, ఇదిగో ఇలా వారి మెడలో చెప్పులు, బూట్ల దండలు వేసి ( garlanded with shoes ) ఊరంతా తిప్పించారు ( paraded in village ). 

Last Updated : Sep 10, 2020, 01:40 AM IST
Couple garlanded with shoes: ప్రేమ జంటకు చెప్పుల దండ

ఖుషీనగర్: ప్రేమించుకున్న పాపానికి ఓ ప్రేమ జంటను ( Couple in love ) హింసించి, వారి ముఖాలపై నల్ల రంగు పులిమి, ఇదిగో ఇలా వారి మెడలో చెప్పులు, బూట్ల దండలు వేసి ( garlanded with shoes ) ఊరంతా తిప్పించిన ( paraded in village ) ఘటన తాజాగా ఉత్తర్ ప్రదేశ్‌లోని ఖుషీనగర్ జిల్లా ( Kushinagar district ) హతా పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ప్రేమ జంటను ఊర్లో పరేడ్ చేయించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Also read : Cow urine Hand sanitizers: గోమూత్రంతో శానిటైజర్.. కరోనాక్ చెక్ పెడుతుందా ?

ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన జిల్లా ఎస్పీ వినోద్ కుమార్ మిశ్రా.. ఈ ఘటనకు బాధ్యులైన గ్రామ పెద్దతో సహా 12 మందిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేపట్టారు. ఖుషీనగర్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం హతా పోలీసు స్టేషన్ పరిధిలో ఒకే ప్రాంతంలో నివాసం ఉంటున్న ఈ యువతి, యువకుడు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి యువతిని కలిసేందుకు వచ్చిన యువకుడిని ఆమె కుటుంబసభ్యులు పట్టుకుని ఓ గదిలో బంధించారు. Also read : T20I ICC rankings: టీ20 ర్యాంకింగ్స్‌‌లో మలన్ నంబర్‌ 1.. కోహ్లీ స్థానం ఎంతో తెలుసా ?

ఈ విషయం తెలుసుకున్న గ్రామ పెద్ద.. ఊరిలో మరొకరు ఈ తప్పు చేయకుండా ఉండాలంటే.. వారికి బహిరంగంగా శిక్ష విధించాలంటూ గ్రామస్తులను వారిపైకి ఉసిగొల్పాడు. దీంతో రెచ్చిపోయిన పలువురు గ్రామస్తులు.. వారికి ఇలా పబ్లిక్‌గా పనిష్మెంట్ ఇచ్చారని పోలీసులు తెలిపారు. Also read : Rafale fighter jets: జాతికి అంకితం కానున్న రఫేల్ యుద్ధ విమానాలు

Trending News