న్యూఢిల్లీ: టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల వివాహం జరిగే వరకు చాలా ఊహాగానాలు కొనసాగాయి. ఇద్దరూ సోషల్ మీడియాలో పోస్టులు పెడితే.. అప్పుడు పెళ్లి నిజమే అని అనుకున్నారు. ఇద్దరూ డిసెంబర్ 11 న ఇటలీలోని టుస్కానీలో వివాహం చేసుకున్నారు. కోహ్లీ పెళ్లి విషయం చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. టీం ఇండియా కోచ్ రవిశాస్త్రికి కూడా వీరి వివాహం చాలా సమయం తరువాత తెలిసింది. ఈ విషయాన్ని కోచ్ రవి శాస్త్రి స్వయంగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.
టీం ఇండియా హెడ్ కోచ్ రవి శాస్త్రికి, మీకు వీరిద్దరి పెళ్లి గురించి ముందే తెలుసా? అని అడగ్గా.. నాకు వివాహం జరగడానికి 10 రోజుల ముందు తెలుసని చెప్పారు. ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. తరువాత కోహ్లితో ఎస్ఎంఎస్ సంభాషణలు జరిగాయని అన్నారు. ఇండియాకు తిరిగి వస్తే కలిసి అభినందనలు తెలుపుతానని చెప్పానని అన్నారు. వివాహం తర్వాత మీరు ఆయనతో ఏమైనా మాట్లాడారా అని రవిశాస్త్రిని అడిగితే, "నేను ఇప్పుడు తనతో మాట్లాడలేదు. కానీ ఇద్దరం మెసేజ్ లు చేసుకున్నాం. విరాట్-అనుష్క వివాహం చాలా సంతోషం అనిపించింది" అన్నారు.
భారత క్రికెట్ కోచ్ రవి శాస్త్రి జట్టు 18 నెలల టూర్ గురించి మాట్లాడారు. ఈ సమయంలో టీమిండియా దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా దేశాల్లో పర్యటిస్తుంది. టీమిండియా జట్టు ఎప్పుడూ ఆస్ట్రేలియా మరియు దక్షిణాఫ్రికాలో టెస్ట్ సిరీస్ ను గెలవలేదు. మేము ఈ రెండు దేశాలలో బాగా ఆడుతాము. ఈ జట్టు టెస్టుల్లో 20 వికెట్లు తీసుకోగల సామర్థ్యాన్ని కలిగి ఉందన్నారు.