చైనా దేశపు యాప్ వి చాట్ ( China app wechat ) కు ఊరట లభించింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ( Donald trump ) కు షాక్ తగిలింది. నిషేధాన్ని నిలిపివేయాలంటూ కాలిఫోర్నియా కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
చైనా దేశానికి చెందిన 89 యాప్ లను ఇండియా నిషేధించిన ( India banned 89 china apps ) అనంతరం అగ్రరాజ్యం అమెరికా ( America ) చైనాకు చెందిన రెండు యాప్ లపై నిషేధం విధించింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్...చైనాకు చెందిన టిక్ టాక్ ( TikTok ) , వి చాట్ ( Wechat ) పై ఆదివారం నుంచి నిషేధం విధించారు. అయితే ఈ నిర్ణయానికి సంబంధించి ట్రంప్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది.
వి చాట్ మెసేజింగ్ యాప్ డౌన్ లోడ్ పై నిషేధంపై అమెరికాలోని కాలిఫోర్నియా కోర్టు ( California court ) ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిషేధ ఉత్తర్వులు భావ ప్రకటనా స్వేచ్ఛకు వ్యతిరేకమని...నిషేధాన్ని ఆపాలని ఆదేశాలు జారీ చేసింది. అమెరికాలో 19 మిలియన్ల యాక్టివ్ యూజర్లు ఉన్న వీచాట్ తాజా పరిణామంపై స్పందించేందుకు నిరాకరించింది.
ఈ తీర్పుపై ప్రభుత్వం అప్పీల్ చేసి మళ్లీ గెలిచినా, ఆ నిర్ణయాన్ని కూడా అప్పీల్ చేయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. చైనాకు చెందిన టిక్‌టాక్, వీచాట్ యాప్‌ల వల్ల జాతీయ భద్రతకు ముప్పు ఉందనే కారణంతో ట్రంప్ సర్కారు గత ఆదివారం నుంచి నిషేధించింది. అయితే, తాజా పరిణామంతో ఆదివారం అర్ధరాత్రి నుంచి అమలులోకి రావాల్సిన నిషేధం అమలకు కొద్ది గంటలముందు కోర్టు ఇచ్చిన ఆదేశాలతో నిలిచిపోయింది. వీచాట్ యాప్ అనేది చైనా దేశానికి చెందిన ప్రముఖ టెక్నాలజీ దిగ్గజమైన టెన్సెంట్ సంస్థకు చెందినది. Also read: Blue Snake: ఎంత ముద్దుగా ఉందో..అంత విషం కూడా
Wechat App: నిషేధాన్ని నిలిపివేసిన కాలిఫోర్నియా కోర్టు