Section 144 imposed in Kerala till October 31: తిరువనంతపురం: భారత్ ఇప్పటికే అన్‌లాక్ (Unlock-5) ఐదవ దశలోకి ప్రవేశించింది. కేంద్ర ప్రభుత్వం గతంలో కంటే ఎక్కువగా సడలింపులు చేసుకుంటూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ సడలింపుల మధ్య కరోనావైరస్ (Coronavirus) కేసులు పెరుగుతుండటంతో.. కేరళ రాష్ర్టం ఇప్పటికీ ఆంక్షలను కొనసాగిస్తూనే ఉంది. తాజాగా కేరళ (Kerala) లో నేటినుంచి 144 సెక్షన్ విధిస్తూ ఆ రాష్ర్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో పెరుగుతున్న కోవిడ్-19 కేసుల కారణంగా నేటినుంచి ఈ నెల 31వ తేదీ వరకు 144 సెక్షన్‌ను విధిస్తూ చర్యలు తీసుకుంది. Also read: India Covid-19: దేశంలో లక్ష మార్క్ దాటిన కరోనా మరణాలు
అయితే ఒకేచోట ఐదు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటాన్ని ప్రభుత్వం నిషేధించింది. రాష్ట్రంలో కరోనా కేసులు కట్టడి చేసేందుకే నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇదిలాఉంటే.. కేరళలో అత్యధికంగా ఒకే రోజులో 9,258 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కలిపి రాష్ట్రంలో వైరస్ సోకిన వారి సంఖ్య 77,482కు చేరుకుంది. అయితే ఎక్కువగా కోజికోడ్ జిల్లాలో 1,146 కేసులు నమోదు కాగా.. తిరువనంతపురంలో 1,096, ఎర్నాకుళం 1,042, మలప్పురంలో 1,016 చొప్పున కేసులు నమోదయ్యాయి. Also read: Sushant death case: సుశాంత్‌ది హత్య కాదు: ఎయిమ్స్ బృందం
ఇదిలాఉంటే.. భారత్‌లో కరోనా మరణాల సంఖ్య తాజాగా లక్ష మార్క్ దాటింది. అయితే కరోనా కేసుల సంఖ్య 64,73,545 కి చేరింది. ప్రస్తుతం దేశంలో 9,44,996 క్రియాశీల కేసులు ఉండగా.. 54,27,707 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. Also read : Hathras incident: ఎస్పీ సహా ఐదుగురు పోలీసులపై వేటు