వైఎస్సార్‌సీపీ (YSRCP) ఎమ్మెల్యే చేసిన విమర్శలు కృష్ణా జిల్లా కలెక్టర్ అధికారిక ట్విట్టర్‌లో దర్శనమివ్వడం దుమారం రేపుతోంది. మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీసీ నేతలు చేసిన వ్యాఖ్యలను కలెక్టర్ ట్వీట్ చేయడం సరైన చర్య కాదంటూ తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని (Kesineni Nani) దీటుగా స్పందించారు. అనంతరం కలెక్టర్ ఖాతా నుంచి ట్వీట్ తొలగించడం జరిగింది. తాను ట్వీట్లు చేయనని, డీపీఆర్ఓ ఖాతా వ్యవహారాలు చూసుకుంటారని కలెక్టర్ అన్నారు. ఈ విషయాన్ని టీడీపీ శ్రేణులు సీరియస్‌గా తీసుకున్నాయి.
Also Read : YSRCP ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి రెండోసారి కరోనా..
ఇప్పటికే కొందరు పోలీసులు వైఎస్సార్‌సీపీ నేతలో సేవలో తరిస్తున్నారంటూ టీడీపీ అధికారిక ట్విట్టర్ ద్వారా మండిపడింది. కలెక్టర్ చేసిన ట్విట్‌ను ఉద్దేశించి స్పందిస్తూ... వైఎస్సార్‌సీపీ కార్యకర్త అనిపించుకునే తాపత్రయం ఎందుకని ప్రశ్నించింది. ప్రజల డబ్బుతో జీతాలు తీసుకుంటూ అధికార పార్టీలో సేవలు చేయడంతో ఏంటో అధికారులే ఆలోచించుకోవాలంటూ టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
Also Read : Jawahar Reddy TTD EO: టీటీడీ ఈవోగా జవహర్ రెడ్డి.. ఉత్తర్వులు జారీ
కృష్ణా జిల్లా కలెక్టర్ ట్వీట్‌పై దీటుగా స్పందించిన టీడీపీ ఎంపీ కేశినేని నాని
కలెక్టర్ గారు మీరొక ప్రభుత్వ అధికారని గుర్తుంచుకోవాలి.ఒక మాజీ ముఖ్యమంత్రి గారి మీద ఒక శాసనసభ్యుడు చేసిన విమర్శను మీరు ట్వీట్ చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను.మీ తప్పును వెంటనే సరిదిద్దుకోవలసిందిగా డిమాండ్ చేస్తున్నాను @rashtrapatibhvn @VPSecretariat @narendramodi @AmitShah https://t.co/yUDXQAIzoI
— Kesineni Nani (@kesineni_nani) October 7, 2020
టీడీపీ అధికారిక ట్విట్టర్‌లో రియాక్షన్ ఇలా...
కృష్ణాజిల్లా కలెక్టర్ ట్విట్టర్ ఖాతాలో నారా చంద్రబాబు నాయుడు పై వైసీపీ ఎమ్మెల్యే చేసిన విమర్శ తాలూకు సాక్షి పేపర్ క్లిప్ ప్రత్యక్షం అయ్యింది. దీనిపై తెలుగుదేశం ఎంపీ కేశినేని నాని దీటుగా స్పందించడంతో..తనకేమీ తెలియదని, తన ట్విట్టర్ ఖాతాను డీపీఆర్ఓ చూస్తారని కలెక్టర్ అన్నారు.(1/2) pic.twitter.com/6Zy1sVGVTM
— Telugu Desam Party #StayHomeSaveLives (@JaiTDP) October 8, 2020
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe