Indian Railways: తెలుగు రాష్ట్రాల మధ్య పెరగనున్న రైళ్ల వేగం

Trains speed in south central railway limits: హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో తరచుగా రైలు ప్రయాణాలు చేసేవారికి గుడ్ న్యూస్. రైలులో దూర ప్రయాణం చేసేవారికి రైలు ప్రయాణంలో వ్యయ ప్రయాసలు తగ్గించడం కోసం ఎప్పటికప్పుడు కొత్త ఆవిష్కరణలు తీసుకురావడానికి కృషి చేస్తోన్న ఇండియన్ రైల్వేస్ ( Indian Railways ).. తాజాగా రైళ్ల వేగం పెంచే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

Last Updated : Oct 9, 2020, 12:15 AM IST
Indian Railways: తెలుగు రాష్ట్రాల మధ్య పెరగనున్న రైళ్ల వేగం

Trains speed in south central railway limits: హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో తరచుగా రైలు ప్రయాణాలు చేసేవారికి గుడ్ న్యూస్. రైలులో దూర ప్రయాణం చేసేవారికి రైలు ప్రయాణంలో వ్యయ ప్రయాసలు తగ్గించడం కోసం ఎప్పటికప్పుడు కొత్త ఆవిష్కరణలు తీసుకురావడానికి కృషి చేస్తోన్న ఇండియన్ రైల్వేస్ ( Indian Railways ).. తాజాగా రైళ్ల వేగం పెంచే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అందులో భాగంగానే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్రలోని బల్లార్షా నుంచి సికింద్రాబాద్ మధ్య రాకపోకలు సాగించే రైళ్ల వేగం పెంచేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. అందుకోసం దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని స్వర్ణ చతుర్బుజి సెక్షన్‌లో రైల్వే ట్రాక్స్‌ని మరింత బలోపేతం చేయడంతో పాటు అవసరమైన చోట మరమ్మతులు చేపడుతున్నారు. Also read : Ram Vilas Paswan's death: కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కన్నుమూత

దక్షిణ మధ్య రైల్వే ( South central railways ) పరిధిలో ప్రస్తుతం రైళ్లు పలు మార్గాల్లో గరిష్టంగా గంటకు 110 కిమీ వేగంతో ( Trains maximum speed ) ప్రయాణిస్తుండగా ఇంకొన్ని మార్గాల్లో గంటకు 120 కి.మీ వేగంతో పరిగెడుతున్నాయి. ఈ గరిష్ట వేగాన్ని గంటకు 130 కిమీ వేగంతో పరిగెత్తేలా చేయడం కోసం ప్రస్తుతం రైల్వే అధికారులు కసరత్తులు చేస్తున్నారు. 

ఈ కసరత్తులు పూర్తయిన అనంతరం పలు ట్రయల్స్ వేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ నుంచి గరిష్ట వేగం పెంచేందుకు అవసరమైన అనుమతులు పొందాల్సి ఉంటుంది. అనంతరం అనుమతించిన మార్గాలలో రైళ్లు వేగంగా పరిగెత్తనున్నాయి. అదే కానీ జరిగిందంటే.. ప్రస్తుతం రైలు ప్రయాణాలకే ఎక్కువ సమయం వృధా అయిపోతుందేనని ఆందోళన చెందేవారికి ఆ తిప్పలు కొంతమేరకు తగ్గనున్నాయి. Also read : Baba ka Dhaba viral video: గిరాకీ లేదని కన్నీళ్లు పెట్టుకున్న వృద్ధ దంపతులు.. వీడియో వైరల్

Trending News