వైరల్ అవుతున్న సానియా 'బిర్యానీ' పోస్ట్

టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, మరో అంతర్జాతీయ టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్‌ని ఆటపట్టిస్తోన్న ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Last Updated : Dec 25, 2017, 06:38 PM IST
వైరల్ అవుతున్న సానియా 'బిర్యానీ' పోస్ట్

టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, మరో అంతర్జాతీయ టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్‌ని ఆటపట్టిస్తోన్న ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పోస్టులో సానియా, ఫెదరర్‌తో మాట్లాడుతూ బటర్ చికెన్ కన్నా హైదరాబాద్ బిర్యానీ బాగుంటుందని చెవిలో చెబుతున్నట్లు ఓ ఫోటో పోస్టు చేయడం గమనార్హం. అయితే ఈ పోస్టుకి ఇప్పటికే చాలా పాజిటివ్ కామెంట్లతో పాటు నెగటివ్ కామెంట్లు కూడా వచ్చాయి.

సానియా హైదరాబాదీ కావడం వల్లే బిర్యానీని పొగిడిందని.. పంజాబీ వంటకమైన బటర్ చికెన్‌ను పట్టించుకోలేదని అనేకమంది పోస్టు చేశారు. కొందరైతే ఈ పోస్టు అర్థం కాలేదన్నారు. రోజర్, సానియా మిక్స్‌డ్ డబుల్స్ ఆడుతున్నప్పుడు ఎవరో తీసిన ఫోటోకి సానియా ఫన్నీ కామెంట్ రూపంలో ఈ పోస్టు క్రియేట్ చేసి పెట్టిందనే విషయాన్ని ఆలస్యంగా గ్రహించారు ఆమె అభిమానులు. 

 

Trending News