Pawan Kalyan Mahastra Elections: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పరపతి కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం నడుం బిగించిన నేతగా దేశ వ్యాప్తంగా మెజారిటీ హిందువుల మనసు చూరగొన్నాడు. అంతేకాదు వేరే మతుస్తులకు ఏదైనా ప్రాబ్లెమ్ వస్తే తానే ముందుండి పోరాడుతానంటున్నాడు. ఇక తిరుమల లడ్డూ వ్యవహారంతో పాటు సనాతన ధర్మ పరిరక్షకుడిగా పవన్ కళ్యాణ్ కు దేశ వ్యాప్తంగా అభిమానులు ఏర్పడిచారు. తాజాగా కేంద్రంలోని పెద్డలు పవన్ కళ్యాణ్ కు కీలక బాధ్యతలు అప్పగించారు.
మహారాష్ట్రలో ఈ నెల 20న ఎన్నికలు జరగనున్నాయి. ఎలక్షన్స్ ప్రచారానికి మరో మూడు రోజులు గడువు మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఈ నెల 16,17వ తేదిల్లో మహారాష్ట్రలో ఎన్డీయే అభ్యర్ధుల తరుపున ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ముఖ్యంగా మరాట్వాడా, విదర్భ, పశ్చిమ మహారాష్ట్రలో ఐదు బహిరంగ సభల్లో .. రెండు రోడ్ షోలలో పాల్గొనబోతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేసారు.
మహారాష్ట్రలో బీజేపీ, శివసేన (శిందే), ఎన్సీపీ అభ్యర్ధులైన మహా వికాస్ యుతి (NDA)అభ్యర్ధుల తరుపున బీజేపీ మరియు ఇతర ఎన్డీయే నేతలతో కలిసి ప్రచారం నిర్వహించబోతున్నారు. మొదటి రోజు మరాట్వాడాలోని పలు అసెంబ్లీ సెగ్మెంట్స్ లలో పాల్గొంటారు. ఆ తర్వాత భోకర్ నియోజకవర్గానికి వెళతారు. అక్కడ ఎన్డీయే నిర్వహించే సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు లాతూరు చేరుకొని ప్రచారం నిర్వహిస్తారు. రాత్రి 6 గంటలకు షోలాపూర్ లో నిర్వహించే రోడ్ షోలో పాల్గొంటారు.
ఇక 17వ తేదిన విదర్భ ప్రాంతానికి చేరుకుంటారు. ఆ రోజు ఉదయం చంద్రాపూర్ జిల్లాలోని బల్లార్ పూర్ పట్టణంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటాడు. అదే రోజు సాయంత్రం పూణె కంటోన్మెంట్ పరిధిలో జరిగే రోడ్ షోలో పాల్గొంటారు. ఆ తర్వాత కస్బాపేట్ నియోజకవర్గంలో నిర్వహించే సభలో పాల్గొంటారు. మొత్తంగా మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ పర్యటించే ప్రాంతాల్లో తెలుగు వాళ్లు ఎక్కువగా ఉన్నారు. పైగా ఊర మాస్ హీరోగా పవన్ కళ్యాణ్ ఇమేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. దీంతో పవన్ కళ్యాణ్ సభలతో అక్కడ బీజేపీ కూటమికి ఓట్లు మరింతగా పెరిగే అవకాశాలు లేకపోలేదు.
ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి